ముప్పాళ్ల ఎస్సై జగదీష్ పై రెండో భార్య ఫిర్యాదు..

గుంటూరు జిల్లా, ముప్పాళ్ళ ఎస్ ఐ జగదీశ్ పై ఆయన రెండో భార్య సింధు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

First Published Jul 3, 2020, 11:29 AM IST | Last Updated Jul 3, 2020, 11:29 AM IST

గుంటూరు జిల్లా, ముప్పాళ్ళ ఎస్ ఐ జగదీశ్ పై ఆయన రెండో భార్య సింధు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 2013లో మొదటి భర్తతో సమస్యలున్నాయని పోలీస్ స్టేషన్ కు వెడితే ఆ సమయంలో ముప్పాళ్లలో ఎస్పై గా ఉన్న జగదీశ్ మాయమాటలతో లొంగదీసుకున్నాడని తెలిపింది. తనకింకా పెళ్లి కాలేదని, తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాడని అయితే అప్పటికే జగదీష్ కు పెళ్లై పిల్లలున్న సంగతి తెలియడంతో నిలదీశానని తెలిపింది. దీంతో మొదటి భర్తతో విడాకులు అయ్యేవరకు సహజీవనం చేశామని, ఆ తరువాత పెళ్లి చేసుకున్నాడని అంటోంది. ఇప్పుడు జగదీష్ తో తనకో బాబు అని తనను చంపడానికి జగదీష్ ప్రయత్నిస్తున్నాడంటూ నరసరావుపేట రూరల్ పోలీస్టేషన్ లో సింధు  ఫిర్యాదు చేసింది.