మరో పెళ్లికి సిద్ధపడ్డ భర్త.. ఇంటి ముందు ధర్నాకు దిగిన భార్య (వీడియో)
కర్నూలులో ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు ఓ మహిళ ఆందోళన చేపట్టింది.
కర్నూలులో ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ భర్త ఇంటి ముందు ఓ మహిళ ఆందోళన చేపట్టింది. స్థానిక రెవెన్యూ కాలనీలో నివాసముంటున్న ప్రణీత్ అశోక్ నగర్ నివాసి అయిన చంద్రకళని 8 ఏళ్ల క్రితం ఇంట్లో చెప్పకుండా యాగంటిలో పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత రెండేళ్లకు ఇంట్లో విషయం చెప్పారు. గతేడాది ప్రణీత్ ఇంట్లో వాళ్లు కూడా పెళ్లికి అంగీకరించారు. అయితే ఎనిమిదేళ్లుగా తనతో కాపురం చేస్తూ ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకోవడానికి ప్రణీత్ సిద్ధమయ్యాడని తనకు న్యాయం చేయాలంటూ చంద్రకళ ప్రణీత్ ఇంటిముందు నిరసన దీక్ష చేపట్టింది.