Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో భారీగా పట్టుబడ్డ తెలంగాణ మద్యం... ఓ ముఠా అరెస్ట్

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా తెలంగాణ మద్యం పట్టుబడింది. 

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా తెలంగాణ మద్యం పట్టుబడింది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చిలుకూరు ద్వారక వైన్ షాప్ నుంచి ఏపీకి తరలిస్తున్న మద్యం పట్టుబడింది. ఈ తనిఖీల్లో 610  మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మద్యాన్ని తరలిస్తున్న కారుతో పాటు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని  డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.