ప్రకాశం జిల్లాలో ఘోరం... లారీని ఢీకొని కాలిబూడిదైన కారు, ముగ్గురు సజీవదహనం
ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసకుంది. అతివేగంగా వెళుతున్న కారు మార్కాపురం మండలం తిప్పాయపాలెం దగ్గరలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి కారుతో పాటు అందులోని ముగ్గురు వ్యక్తులు కూడా సజీవదహనం అయ్యారు.
ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసకుంది. అతివేగంగా వెళుతున్న కారు మార్కాపురం మండలం తిప్పాయపాలెం దగ్గరలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి కారుతో పాటు అందులోని ముగ్గురు వ్యక్తులు కూడా సజీవదహనం అయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ కిందకు దిగి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు కడప జిల్లా బాదరావుపేటకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. కారు టైరు పేలడంవల్లే అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే స్థానిక డిఎస్పీ కిషోర్ కుమార్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. పైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేసారు. అయితే అప్పటికే కారుమొత్తం దగ్దమైపోయింది. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.