అమానుషం.. మున్సిపల్ చెత్త వాహనంలో కరోనా పేషంట్లు..
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం, జరజాపు పేటలో కరోనా పాజిటివ్ వ్యక్తుల పట్ల అమానుషంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం, జరజాపు పేటలో కరోనా పాజిటివ్ వ్యక్తుల పట్ల అమానుషంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెడితే జరజాపు పేట, బీసీ కాలనీలో కరోనా బారిన పడిన ముగ్గురిని మున్సిపాలిటీ చెత్త వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఇది తమకు తెలిసి జరగలేదని వాహనాన్ని తామెప్పుడూ అలా ఉపయోగించలేదని మున్సిపల్ సిబ్బంది అంటున్నారు