వర్షాలకు ముంచెత్తిన డ్రైనేజీ వాటర్.. 14 కుటుంబాలు నీటిలోనే...
కర్నూలు లో గత రాత్రి కురిసిన వర్షానికి కాల్వలు పొంగి మమతానగర్ లోని 14 ఇండ్లలోకి డ్రైనేజి వాటర్ ముంచెత్తింది.
కర్నూలు లో గత రాత్రి కురిసిన వర్షానికి కాల్వలు పొంగి మమతానగర్ లోని 14 ఇండ్లలోకి డ్రైనేజి వాటర్ ముంచెత్తింది. వర్షాలు వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి అని, ప్రతీసారి అధికారులకు మొరపెట్టుకున్న ప్రయోజనం ఉండడం లేదని బాధితులు వాపోతున్నారు. అధికారులు వచ్చి చూసి పోతున్నారని, ఇండ్ల స్థలాలకు పెట్టుకున్నా రాలేదని, వంట సామానంతా మురుగునీటిలో నానిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.