Search results - 19 Results
 • Kane Williamson

  CRICKET23, Apr 2019, 6:26 PM IST

  సన్ రైజర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ...కీలక ఓవర్సీస్ ఆటగాడు జట్టుకు దూరం

  ఇటీవల ఐపిఎల్ సక్సెస్ పుల్ జట్టు చెన్నైని ఓడించిన సన్ రైజర్స్ మరోసారి ఆ జట్టుతో మంగళవారం తలపడనుంది. చెన్నై వేదికగా జరగనున్న  ఈ మ్యాచ్ కు ముందే హైదరాబాద్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగత కారణాలతో సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్వదేశాని  వెళ్లిపోయాడు. దీంతో చెన్నై మ్యాచ్ కు అతడు దూరమయ్యాడు. 

 • SRH Flag

  CRICKET22, Apr 2019, 9:10 PM IST

  ఐపిఎల్ 2019 ఫైనల్‌ హైదరాబాద్‌లోనే...కీలక మ్యాచులకు విశాఖ ఆతిథ్యం

  ఈ ఐపిఎల్ సీజన్ 12 తెలుగు క్రికెట్ ప్రియులను మరింత ఉర్రూతలూగించనుంది. ఇప్పటికే ఐపిఎల్ లీగ్ దశలో భాగంగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. మరికొన్ని మ్యాచులు జరగాల్సి వుంది. వీటినే ప్రత్యక్షంగా చూసే అవకాశం రావడంతో తెలుగు ప్రేక్షకులు సంబరపడిపోతుంటే తాజా వార్తతో వారి పరిస్థితి బూరెల బుట్టలో పడ్డట్లయింది. చెన్నై వేదికగా జరగాల్సిన ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. కొన్ని కారణాలతో ఈ మ్యాచ్ ను చెన్నై నుండి తరలిస్తున్నట్లు ఐపిఎల్ అధికారులు చెబుతున్నారు. 

 • Suresh Raina

  SPORTS18, Apr 2019, 8:59 AM IST

  ధోనీ ఉంటే బాగుండేది.. ఓటమిపై రైనా కామెంట్స్

  వరస విజయాలతో దూసుకువెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కి ఒక్కసారిగా బ్రేక్ పడింది. బుధవారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి చవి చూసింది.

 • dhoni sad csk

  CRICKET17, Apr 2019, 8:02 PM IST

  హైదరాబాద్ మ్యాచ్‌కు ధోని దూరం... చెన్నై కెప్టెన్‌గా రైనా

  ఐపిఎల్ సీజన్ 12 లో భాగంగా హైదరాబాద్ రాజీవ్ గాందీ స్టేడియంలో బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ అభిమానులు ఎంఎస్ ధోనిని చూసే అదృష్టాన్ని కోల్పోయారు. ఇవాళ్టి మ్యాచ్ నుండి ధోనికి విశ్రాంతి ఇచ్చి సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనాకు జట్టు పగ్గాలు అప్పగించినట్లు చెన్నై మేనేజ్ మెంట్ ప్రకటించింది. 

 • CRICKET17, Apr 2019, 7:48 PM IST

  మా జట్టు సమస్య అదే...దాన్ని అధిగమిస్తేనే చెన్నైపై విజయం: భువనేశ్వర్

  ఐపిఎల్ 2019 లో ఆరంభంలో వరుస విజయాలతో ఊపుమీదున్నట్లు కనిపించిన సన్ రైజర్స్ రాను రాను గాడితప్పింది. ఎక్కువగా ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో పైనే జట్టు ఆధారపడుతుండటంతో హైదరాబాద్ కు వరుస ఓటములు తప్పడంలేదు. ఈ క్రమంలో బుధవారం సొంత మైదానంలో సన్ రైజర్స్ ఐపిఎల్ లోనే అత్యంత సక్సెస్ ఫుల్ జట్టు చెన్నై తో తలపడనుంది. ఇలా బలమైన జట్టును సొంత మైదానంలో ఎదురిస్తున్న హైదరాబాద్ జట్టు తమ బలహీనతను గుర్తించిందని సన్ రైజర్స్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పేర్కొన్నాడు. దాన్ని అధిగమిస్తే తాము చెన్నైని సైతం ఓడించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.

 • Warner

  CRICKET9, Apr 2019, 1:49 PM IST

  మన్కడింగ్ ఎఫెక్ట్: అశ్విన్ బౌలింగ్ లో వార్నర్ అలెర్ట్ (వీడియో)

  మన్కడింగ్...ఈ పేరు కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ మూలంగా ఐపిఎల్ లో బాగా ఫేమస్ అయ్యింది. అతడు రాజస్థాన్ బ్యాట్ మెన్ బట్లర్ ని ఇలా మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడం తీవ్ర విమర్శలకు, వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ జట్టు పంజాబ్ పై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అశ్విన్ బౌలింగ్ లో మన్కడింగ్ కు గురవకుండా వార్నర్ జాగ్రత్త పడ్డాడు. 

 • CRICKET4, Apr 2019, 5:58 PM IST

  కోహ్లీ బలహీనతను స్పిన్నర్లు కనిపెట్టేశారు : వివిఎస్ లక్ష్మణ్ విశ్లేషణ

  విరాట్ కోహ్లీ...టీమిండియా ఎన్నో మరుపురాని విజయాలను అందించిన సక్సెస్ ఫుల్ సారథే కాదు బ్యాట్ మెన్ కూడా. అలాంటిది ఐపిఎల్ విషయానికి వస్తే తాను కెప్టెన్ గా వున్న రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టుకు ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలపలేని చెత్త కెప్టెన్ గా పేరుతెచ్చుకున్నాడు. ఇక ఈ ఐపిఎల్ సీజన్ 12 లో అయితే మరింత ఘోరంగా ఆడుతున్న ఆర్సిబి ఇంకా గెలుపు బోణీ కొట్టలేదు. అందరు ప్లేయర్లతో పాటే కోహ్లీ కూడా ఫేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆర్సిబి ఓటమికి కారణమవుతున్నాడు. అయితే ఇలా కోహ్లీ విఫలమవడానికి గల కారణాలను సన్ రైజర్స్ హైదరాబాద్ మెంటర్, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ మీడియాకు వివరించారు. 

 • sandeep

  8, Jun 2018, 6:53 PM IST

  త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న ఐపిఎల్ స్టార్ బౌలర్

  ఐపిఎల్ లో తన అద్బుత బౌలింగ్ ప్రదర్శనతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో తనవంతు పాత్ర పోషించిన బౌలర్ సందీప్ శర్మ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే ఆయన తన ప్రేయసి తాషా సాత్విక్ ను పెళ్లాడనున్నట్లు తెలిపాడు. ఇప్పటికు తమకు నిశ్చితార్థం జరిగిందని సందీప్ శర్మ వెల్లడించారు. తనకు కాబోయే భార్య సాత్విక్ తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన సందీప్ ఈ విషయాన్ని తెలిపాడు.
     

 • 28, May 2018, 12:23 PM IST

  సన్ రైజర్స్ ఓటమిపై వార్నర్ ఏమన్నాడంటే...

  ఐపీఎల్ ఫైనల్ ఓటమిపాలై ట్రోపిని అందుకోలేకపోయామని బాధపడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లకు ఆ జట్టు మాజీ సారథి వార్నర్ అండగా నిలిచారు. తమ జట్టు ఓడిపోవడంపై వార్నర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. జట్టు ఒక్క ఫైనల్ లో ఓడినంత మాత్రాన నిరాశ చెందవద్దని మొత్తం టోర్నమెంట్ లో చూపిన అద్భుత ప్రదర్శనకు గర్వపడాలని వార్నర్ సూచించారు.  

   

 • rasheed khan

  26, May 2018, 10:47 AM IST

  రషీద్ ఖాన్ ఆటలోనే కాదు, అందులోను ముందున్నాడు

  రషీద్‌ ఖాన్‌...ఈ పేరు ఇపుడు ఐపిఎల్ క్రికెట్ లో సంచలనం. ముఖ్యంగా తెలుగు క్రికెట్ అభిమానులను ఫిదా చేస్తున్న చేస్తోంది. తన బౌలింగ్ ప్రతిభతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు చాలా మ్యాచ్ లు గెలింపించినప్పటికి రషీద్ ఖాన్ పేరు అంత సంచలనం కాలేదు. కానీ నిన్న రాత్రి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో అతడు చూపించిన ఆల్ రౌండ్ ప్రతిభకు ప్రతిఒక్కరు ముగ్దులైపోయారు. ఓటమి వైపు పయనిస్తున్న టీమ్ ను మళ్లీ విజయతీరాల వైపు నడిపించిన ఈ అప్ఘాన్ ప్లేయర్ కి ఇండియన్ క్రికెట్ లవర్స్ బ్రహ్మరథం పడుతున్నారు.