మహాత్మా గాంధీ స్ఫూర్తితో కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్టు చేపట్టే సేవా కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున , స్వచ్ఛందంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తుడా చైర్మెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.

మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రపంచ ప్రసిద్ది కోసం చేపట్టిన 70x65 అడుగుల గాంధీ చిత్రలేఖన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు.

ముందుగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయ అవరణలోని నెహ్రూ లలిత కళా ప్రాంగణంలో పెన్సిల్ తో అందంగా తీర్చిదిద్దిన గాంధీ చిత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన చిత్రకారుడి ని అభినందించారు.

అనంతరం స్థానిక క్రైమ్ స్టేషన్ సమీపంలోని గాంధీ ట్రస్టు ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఇక్కడ గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ..దశాబ్దాలుగా నిస్వార్థంగా చేసే అనేక మంచి కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని కొనియాడారు. భవిష్యత్తులో వారు చేపట్టబోయే మంచి కార్యక్రమా ల్లో తాము భాగస్వాములం అవుతామని చెవిరెడ్డి స్పష్టం చేశారు.