తిరుపతి  శ్రీ వెంకటేశ్వర జూ పార్క్‌లో ఓ తెల్ల పులి ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఆసియాలోనే అత్యంత అరుదుగా కనిపించే తెల్లపులులు శేషాచలంలో మనుగడ సాగించ గలుగుతున్నాయి.  కొన్నేళ్ల క్రితం సమీర్, రాణి అనే రెండు తెల్లపులులను ఎస్వీ జూకు తీసుకొచ్చారు. 

వీటికి ప్రస్తుతం ఐదు పులి పిల్లలు జన్మించాయి. అందులో మూడు మగపులులు, రెండు ఆడ పులులు ఉన్నాయి.

శుక్రవారం శ్రీ వెంకటేశ్వర జూ పార్క్‌ను సందర్శించిన రాష్ట్ర అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక మగపులి పిల్లకు జగన్ , ఆడ పులి పిల్లకు విజయ.. మిగిలిన రెండు మగ పిల్లలకు వాసు, సిద్ధాన్ అని, మరో ఆడ పులిపిల్లకు దుర్గ అని నామకరణం  చేశారు. 

వైఎస్ జగన్ ప్రభుత్వం అటవీ సంరక్షణకు పెద్ద పీట వేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జూలోని మౌలిక వసతుల గురించి మంత్రి బాలినేని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తెల్ల పులులు అత్యంత అరుదుగా మాత్రమే కనిపిస్తుండటంతో ఈ పులులను చూడటానికి జంతు ప్రేమికులు పెద్ద సంఖ్యలో తిరుపతి జూకు తరలివస్తున్నారు.