వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, న్యూఇయర్... దాతలకు షాకిచ్చిన టిటిడి
వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సరాది, వైకుంఠ ద్వాదశి రోజుల్లో సామాన్యులను పెద్దపటీ వేసేందుకు టిటిడి సిద్దమైంది.
తిరుమల: 2020 నూతన సంవత్సరం ఆరంభంలో భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1న సంవత్సరాది, జనవరి 6 వైకుంఠ ఏకాదశి, 7వ తేదీ వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా కాటేజి దాతలకు గదుల కేటాయింపు నిలుపుదల చేస్తున్నట్లు టిడిపి ప్రకటించింది.
Read more శ్రీవారి దర్శనభాగ్యం... వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారుల పేరెంట్స్ కి ప్రత్యేకం...
ఈ రోజుల్లో తిరుమలకు విశేషంగా విచ్చేసే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాటేజీ దాతలకు, దాతల సిఫార్సు లేఖలు తీసుకొచ్చే వారికి గదుల కేటాయింపు నిలుపుదల చేస్తున్నట్టు టిటిడి ప్రకటించింది. నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబరు 30, జనవరి 1న, వైకుంఠ ఏకాదశి, ద్వాదశిని పురస్కరించుకుని జనవరి 4 నుండి 7వ తేదీ వరకు గదుల కేటాయింపు ఉండదని పేర్కొంది.
Read more టిటిడి ఆస్తులపై ఈవో ఆరా... డాక్యుమెంటేషన్ పూర్తి చేయాలని ఆదేశం...
ఈ మేరకు కాటేజి డోనార్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అప్లికేషన్‌లో కూడా టిటిడి మార్పులు చేపట్టింది. దాతలు ఈ విషయాన్ని గమనించాలని టిటిడి ప్రకటించింది. ఇలా వచ్చే ఏడాది జనవరిలో ఆరు రోజులకు మాత్రమే ఈ నిర్ణయం పరిమితమన్నారు. సామాన్య భక్తుల సౌకర్యార్థమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి పేర్కొంది.