తిరుమల సమాచారం: భారీ వర్షంతో ఇబ్బందుల్లో భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాతోంది. క్యూలైన్‌లో భారీగా భక్తుల వేచిఉన్నారు. ఆదివారం తిరుమల ఎండ ఎక్కువగా ఉండడంతో ఎండతాపానికి భక్తులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రానికి కుండపోతగా వర్షం కురిసుంది. దీంతో వానకి తడుస్తూ అవస్థలు పడ్డారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాతోంది. క్యూలైన్‌లో భారీగా భక్తుల వేచిఉన్నారు. ఆదివారం తిరుమల ఎండ ఎక్కువగా ఉండడంతో ఎండతాపానికి భక్తులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రానికి కుండపోతగా వర్షం కురిసుంది. దీంతో వానకి తడుస్తూ అవస్థలు పడ్డారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో క్యూలైన్‌లో నిలబడిన భక్తులు స్వామి దర్శనం కాకుండానే వెనుదిరిగారు.
మరికొంత మంది అఖిలాండం వద్ద మొక్కులు తీర్చుకుని తిరుగు ప్రయాణమయ్యారు.వారాంతం పెలవులు పెరటాసి నెలాంతం కావడంతో తిరుమల కొండ భక్తసంద్రంగా మారింది..
రద్దీ ఎక్కువడా ఉండడంతో వీఐపీ దర్శనాలను బాగా కుదించింది టీటీడీ. ఆదివారం ఏకంగా 1 1,03,310 మంది భక్తులు కలియుగ దైవాన్ని దర్శించుకున్నారు. రికార్డుస్థాయిలో భక్తులు తలనీలాలు సమర్పించారు. సర్వదర్శనానికి దాదాపు 16గంటలు పమయంపడుతుంది అధికారులు ప్రకటించారు. హుండీ ఆదాయం ₹: 3.44 కోట్లు సమకూరింది
భక్తులు పోటెత్తుండడంతో తిరుమల వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. స్వామి దర్శనానికి దాదాపు 26 గంటలకు పైగా సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు.
సెలవులు ముగుస్తుండడం భక్తుల రద్దీ కొండపై ఎక్కువగా ఉంది. కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.