తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.  సెలవులు ముగుస్తుండడంతో  తిరుమలకు భక్తులు తాకిడి అదికంగాఉంది.  క్యూ కాంప్లెక్స్ లోని గదులన్నీ భక్తులతో నిండిపోయాయి.  సర్వదర్శనానికి దాదాపు 24గంటలు సమయం పడుతుండగా స్లాటెడ్‌ దివ్య, సర్వదర్శనాలకు దాదాపు 2గంటలు సమయం పడుతోంది. శనివారం రోజున  అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి  మొక్కులు తీర్చుకున్నారు.

శనివారం స్యామివారి హుండీ అదాయం భారీగా సమకూరినట్లుగా టీటీడీ అధికారులు వెల్లండిచారు. శ్రీవారికి హుండీపై ఆర్ధిక మాంధ్యం ఎఫెక్ట్  పడినట్లు  కనిపిస్తోంది. తాజాగా టీటీడీ భక్తుల సౌకర్యార్ధం కీలక  నిర్ణయం తీసుకుంది. అక్టోబ‌రు 15, 29న  వృద్ధులు, దివ్యాంగులక కోసం  ప్రత్యేక ఉచిత దర్శన ఏర్పాట్లను  చేసింది. అలాగే అక్టోబ‌రు 16, 30 తేదీల్లో చంటిపిల్లల వారి తల్లిదండ్రుల కోసం కూడా  ప్రత్యేకంగా దర్శించేకునే అవకాశం కల్పించారు. 

అదే విధంగా ఎన్నారైల కోసం కూడా స్రత్యేక దర్శన   ఏర్పాట్లను చేసింది టీటీడీ. సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనం కోసం వారికి పత్యేక  అనుమతించారు.భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు విచ్చేస్తుండడంతో  టీటీడీ అధికారులు  భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్ఫాట్లు చేశారు.