చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు బోల్తా పడి తునాతునకలైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, ఒకరు గాయపడ్డారు. మృతులు చెన్నై నుంచి సిద్ధిపేట వస్తున్నారు. చిత్తూరు జిల్ాల పాకాల మండలం గుండ్లగుట్టపల్లి గ్రామం వద్ద శనివారం ఆ ప్రమాదం జరిగింది.

తెలంగాణలోని మల్లన్నసాగర్ కు వస్తూ వారు ప్రమాదానికి గురయ్యారు. వారి వద్ద తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన అనుమతి గుర్తింపు పత్రాలు కూడా ఉన్నాయి.  మృతులను మణిబాలన్ (25), వేలు (27), వేణుగోపాల్ (60)లుగా గుర్తించారు. వారంతా తమిళనాడు రాజధాని చెన్నైకి చెందినవారే. 

వారు మల్లన్నసాగర్ ఎందుకు వస్తున్నారు వంటి విషయాలు తెలియాల్సి ఉంది. ఇంకా మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.