శ్రీవారి చక్రస్నానానికి సర్వం సిద్ధం: రేపటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివరిది అతి ముఖ్యమైనదైన చక్రస్నాన మహోత్సవం మంగళవారం జరుగనుండడంతో టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివరిది అతి ముఖ్యమైనదైన చక్రస్నాన మహోత్సవం మంగళవారం జరుగనుండడంతో టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
అనంతరం ఉదయం 6.00 నుంచి 9.00 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.
అనంతరం స్వామి పుష్కరిణిలో చక్రస్నానాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
రాత్రి 7.00 నుండి 9.00 గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి. ఈ సందర్భంగా టిటిడి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పుష్కరిణిలో గ్యాలరీలను, స్నానఘట్టాలను ఏర్పాటుచేసింది.