గరుడ సేవకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ, పోలీస్ శాఖ అధికారులు. తావులేకుండా, భద్రతలో రాజీ పడకుండా పోలీసులు కసరత్తు చేస్తున్నారు.
గరుడ సేవకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ, పోలీస్ శాఖ అధికారులు. తావులేకుండా, భద్రతలో రాజీ పడకుండా పోలీసులు కసరత్తు చేస్తున్నారు. బందోబస్తుపై అనంతపూర్ రేంజ్ డి.ఐ.జి క్రాంతి రాణా టాటా ఆద్వర్యంలో తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి కె.కె.యన్.అన్బురాజన్, టి.టి.డి సి.వి.&యస్.ఓ శ్రీ గోపినాథ్ జట్టి లు పోలీసు అధికారులు, సిబ్బందికి భద్రతపై సూచనలు చేశారు.
తిరుమల పోలీసు కంట్రోల్ రూమ్ లో జరిగిన సమీక్షా సమావేశంలో డిఐజి కాంతిరాణా టాటా మాట్లాడుతూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన గరుడ వాహనం రోజు లక్షలాదిగా భక్తులు తరలి వస్తారని వీరందరికి సక్రమైన భద్రత కల్పించడం పోలీసుల బాధ్యతని గుర్తు చేశారు
భక్తులను సక్రమమైన పద్దతిలో గ్యాలరీలలో కూర్చొబెట్టాలని.. రద్దీ కారణంగా దొంగతనాలు కూడా జరగడానికి ఆస్కారం వుంటుందన్నారు. అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానంతో (పిన్స్) పాత, కొత్త నేరస్తులను గుర్తించి అదుపులో తెసుకోవడమే కాకుండా చిన్న దొంగతనాలు కూడా జరగకుండా చూసుకోవాలని ఐజీ సూచించారు.
వాహన సేవ అయిన తరువాత తిరుగుప్రయాణంలో బస్టాండ్ల వద్ద రద్దీ వుంటుంది తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని వెల్లడించారు.
తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి మాట్లాడుతూ గత బ్రహ్మోత్సవాలలో జరిగిన పొరబాట్లను గుర్తించుకొని ఈ సారి పొరబాట్లు జరగకుండా చూసుకోవాలని గ్యాలరీలలో డి.యస్.పి స్థాయి అధికార్లు తగిన బాధ్యత వహించాలని ఆదేశించారు. గరుడ సేవ రోజు ఒక్క రోజు కష్టపడితే బ్రహ్మోత్సవం మొత్తం విజయవంతం అయినట్లేనని అన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 2, 2019, 8:04 PM IST