ఎస్వీ శిల్ప కళాశాల పరిధిలో శిలలు తయారు చేసే శిల్పులు తమ సమస్యలను టీటీడీ బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దృష్టికి తెచ్చారు. శుక్రవారం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి  నివాసంలో శిలా శిల్పులు ఆయన్ను కలసి వినతి పత్రం అందజేశారు.  

2008 లో టీటీడీ పాలకమండలి తీర్మానించిన అంశాలను అమలు చేయలేదని వాపోయారు. హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డుల తో పాటు శిలా తయారీ ధరను కూడా పెంచాలని కోరారు.

శిలల తయారీ లో అనేక రకాలుగా అనారోగ్యానికి గురవుతున్నామని తెలిపారు. 2008 నాటి ధరలను శిలల తయారీకి ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. స్పందించిన
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమస్యను టీటీడీ  పాలకమండలి సమావేశంలో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.