చిత్తూరు: చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలంలో దారుణం చోటుచేసుకుంది. గానుగపెంట పంచాయతీ పరిధిలోని కూనపల్లి గ్రామంలో తల్లీకొడుకులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో మండలం మొత్తంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గ్రామానికి చెందిన శేఖర్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తుండగా యుపిఎస్ బ్యాటరీ పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో తల్లి శంకరమ్మ 75 సంవత్సరాలు కొడుకు శేఖర్ 50 సంవత్సరాలు ఇద్దరు సజీవ దహనమయ్యారు. 

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పాకాల ఎస్ఐ రాజశేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.