Asianet News TeluguAsianet News Telugu

ఐసోలేషన్ లో 17 రోజులు: తల్లితో పాటు కోలుకున్న నగరి చిన్నారి

కరోనా వైరస్ మీద సమరం సాగించి తల్లీబిడ్డలు కోలుకున్నారు. చిత్తూరు జిల్లా నగరికి చెందిన చిన్నారి తల్లితో పాటు 17 రోజులు ఐసోలేషన్ లో ఉండి శనివారం నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు.

Mother and daughter discharged from hospital
Author
Nagari, First Published Apr 25, 2020, 6:18 PM IST

చిత్తూరు: కరోనా వైరస్ పాజిటివ్ వ్యాధి నుంచి చిత్తూరు జిల్లా నగరికి చెందిన తల్లీబిడ్డలు కోలుకున్నారు. వాళ్లు 27 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉన్నారు. నెగెటివ్ రావడంతో వారిద్దరిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. చిన్నారితో పాటు తల్లి కూడా కరోనా వైరస్ నెగెటివ్ వచ్చింది.

మహిళకు మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా కరోనా వైరస్ సోకింది. ఏడాదిన్నర వయస్సు గల బాబుకు కరోనా పాజిటివ్ లేదు. అయితే, ఆ బాబును చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో ఆమె అతన్ని తన వెంట తీసుకుని ఐసోలేషన్ కు వెళ్లింది. అయితే, మహిళ తగు జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లాడికి కరోనా సోకకుండా చూసుకుంది. బాబును స్పృశించినప్పుడు గ్లౌజులు వేసుకుంది. బాబు పెద్దమ్మకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె కూడా కరోనా నుంచి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

తుమ్ములు, దగ్గులు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంది. చివరకు ఆమెతో పాటు చిన్నారికి కూడా కరోనా నెగెటివ్ వచ్చింది. దీంతో ఇద్దరిని డిశ్చార్జీ చేశారు. పిల్లాడికి గల రోగ నిరోధక శక్తివల్లనే వ్యాధి సోకలేదని భావిస్తున్నారు. 

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వణుకు పుట్టిస్తోంది. ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేయి దాటింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో తాజాగా 61 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ తో మరో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 31కి చేరుకుంది. 

రాష్ట్రంలో 171 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 814గా ఉంది. గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 25 కేసులు నమోదయ్యాయి.  ఆ తర్వాత కర్నూలు జిల్లాలో కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. 

కర్నూలు జిల్లా మొత్తం 275 కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుంటూరు 209కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ కు దూరంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో మాత్రం కేసులు నమోదు కాలేదు. చిత్తూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో కొత్తగా కేసులేమీ నమోదు కాలేదు. కొంత వరకు ఈ మూడు జిల్లాలకు ఊరట లభించినట్లే.

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వల్ల అత్యధికంగా మంది మరణించగా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎనిమిదేసి మంది మరణించారు. అఅనంతపుూరం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు మరణించారు.

జిల్లాలవారీగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇలా ఉంది....

అనంతపురం 51
చిత్తూరు 73
తూర్పు గోదావరి 37
గుంటూరు 209
కడప 55
కృష్ణా 127
కర్నూలు 275
నెల్లూరు 72
ప్రకాశం 53
శ్రీకాకుళం 3
విశాఖపట్నం 22 

Follow Us:
Download App:
  • android
  • ios