Asianet News TeluguAsianet News Telugu

కాణిపాకం ఆలయంలో లడ్డూ ధర పెంపు

కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ లడ్డూ ప్రసాదం ధరలను పెంచుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది . 

kanipakam laddu prasadam price hiked by  ap endowment department
Author
Tirupati, First Published Sep 27, 2019, 8:45 PM IST

కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ లడ్డూ ప్రసాదం ధరలను పెంచుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది .

10 రూపాయలు ఉన్న లడ్డు ధర 15 రూపాయలు,  50 రూపాయలు ధర 75 రూపాయలు,  100 రూపాయలు ధర 150 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది . ఈ లడ్డూ ధర త్వరలో అమలు చేస్తామని ఈవో దేముళ్ళు తెలిపారు.  

కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నందు ఆర్థిక సంవత్సరం 2014_ 15 నుండి 2017_18 ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ ఆడిట్‌లో లడ్డూ ప్రసాదం తయారీ మరియు అమ్మకమునకు సంబంధించి 5 కోట్ల 80 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తున్నారని తేలింది.

ఈ క్రమంలో అదనపు భారాన్ని తగ్గించే  ప్రక్రియలో భాగంగా దేవస్థానం అధికారుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.  

లడ్డు తయారీకి అగు ఖర్చు మరియు రాబడి వివరములు పరిశీలించిన కమిషనర్ ఇతర దేవాలయములులో విక్రయిస్తున్న లడ్డూ ప్రసాదాల రేట్లను పరిశీలించి లడ్డూ ధరను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి

Follow Us:
Download App:
  • android
  • ios