టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్ర‌త్యేక ఆహ్వానితులైన బెంగ‌ళూరుకు చెందిన  కూపేంద‌ర్‌రెడ్డి శుక్ర‌వారం రూ.70 ల‌క్ష‌లు విలువైన 2 మ‌హేంద్ర అల్టూర‌స్ జి4 కార్ల‌ను 
స్వామివారి సేవకోసం విరాళంగా అందించారు. ఈ మేర‌కు 2 కార్ల‌కు శ్రీ‌వారి ఆల‌యం ఎదుట పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం వాహ‌నాల రికార్డుల‌ను టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

అలాగే మ‌లేసియాకు చెందిన ప్ర‌వాస భార‌తీయులు ర‌వీంద్ర సుబ్ర‌మ‌ణియ‌మ్ కూడా శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయ ట్రస్టు కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డిడిని శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో టిటిడి ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డికి అంద‌జేశారు.