రాష్ట్ర ప్రభుత్వం ఆటొ, ట్యాక్సీ, మ్యాక్సీ, డ్రైవర్లకు అందిస్తున్న ఆర్థిక సహాయం ను సద్వినియోగం చేసుకోవాలన్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్ నారయణ్ భరత్ గుప్తా. శుక్రవారం తిరుపతి ఎస్వీ ఆడిటోరియంలో జరిగిన వైఎస్సార్ వాహనమిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ... టొ,ట్యాక్సీ,మ్యాక్సీ డ్రైవ ర్ లకు ప్రభుత్వం ఆర్థిక సాయం క్రింద అందిస్తున్న రూ.10 వేలును సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. వై.ఎస్. ఆర్ వాహన మిత్రలో దరఖాస్తు చేసుకోని వారు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని కలెక్టర్ వెల్లడించారు.

జిల్లాలో12, 236 మంది డ్రైవర్ లు దరఖాస్తు చేసుకోగా 12,160 మందికి ఆర్థిక సహాయం అందిస్తామని నారాయణ గుప్తా పేర్కొన్నారు.

చిత్తూరు ఎమ్మెల్యే ఎ.శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రజా సంకల్ప యాత్రలో వివిధ వర్గాల బాధలను తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇచ్చిన మాటకు కట్టుబడుతున్నారని ఆయన ప్రశంసించారు.

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. 100 రోజుల పాలనలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకం పూర్తి పారదర్శకత తో నిర్వహించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆదిమూలం తెలిపారు.

డ్రైవర్లందరూ ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు ఆర్‌టి‌ఓలు వివేకానంద రెడ్డి, వెంకట్రామి రెడ్డి, సంబందిత అధికారులు పాల్గొన్నారు 

చంద్రగిరికి చెందిన ధనలక్ష్మి అనే లబ్ధిదారు మాట్లాడుతూ.. తనకు రాస్ వారి సహకారంతో డ్రైవింగ్‌లో శిక్షణ పొంది ఆటోనే నడిపి పిల్లలను చదువుకుంటున్నట్లు తెలిపింది. వాహన మిత్ర ద్వారా సీఎం జగన్ రూ.10 వేలు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

నగరంలోని రాజీవ్ కాలనీకి చెందిన నాగమణి మాట్లాడుతూ..తన భర్త ఆటోడ్రైవర్‌గా  పనిచేస్తూ మరణించడంతో కుటుంబాన్ని పోషించడానికి ఆటోడ్రైవర్‌గా మారానని ఆవేదన వ్యక్తం చేసింది. ఆటో ఇన్సూరెన్స్‌కు, రిపేర్లకు చాలా ఇబ్బందులు పడేవారమని ఇప్పుడు వాహనమిత్ర ద్వారా అందించి సాయంతో ఉపశమనం దక్కిందన్నారు.