తిరుపతి: చిత్తూరు మాజీ పార్లమెంటు సభ్యుడు ఎన్. శివప్రసాద్ మృతికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తాను అన్నయ్యను కోల్పోయానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున శివప్రసాద్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

శివప్రసాద్ భౌతిక కాయానికి ఆదివారం నివాళులు అర్పించిన తర్వాత చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. శివప్రసాద్ ప్రజల మనిషి అని ఆయన అన్నారు. శివప్రసాద్ స్వగ్రామం పులిత్తివారిపల్లిలో త్వరలో విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

రాజకీయ పార్టీలకు అతీతంగా శివప్రసాద్ అందరితో కలిసిపోయేవారని అన్నారు. శివప్రసాద్ మనసున్న మహారాజు అని అన్ారు. చెవిరెడ్డి ప్రకటనతో శివప్రసాద్ అనుచరులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. 

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శివప్రసాద్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన చిత్తూరు ఎంపిగా పనిచేశారు.