Asianet News TeluguAsianet News Telugu

వైభవంగా శ్రీవారి చక్ర స్నానం..వేద మంత్రాల సాక్షిగా..

తిరుమలపై వెలసిన శ్రీమన్నారాయణుడు తన జలక్రీడల కోసం వైకుంఠం నుంచి భువికి స్వయంగా రప్పించిన తీర్థమిదేనని నమ్ముతారు. సకల పాపనాశనిగా ఈ పుష్కరిణికి పేరుంది. తారకాసురుని సంహరించి బ్రహ్మ హత్యాదోషానికి గురైన సుబ్రహ్మణ్యస్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానంచేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. 

chakra snanam complted in tirumala
Author
Hyderabad, First Published Oct 8, 2019, 11:44 AM IST

తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మంగళవారం ఉదయం శ్రీవారికి చక్రస్నానం వైభవంగా జరిగింది. ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో నిర్వహించిన ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భూదేవి, శ్రీదేవి సమేత మలయప్పస్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు.

 ఉద‌యం 7.30 నుంచి 10 గంట‌ల మ‌ధ్య శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు, చ‌క్ర‌త్తాళ్వార్‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం అంగరంగ వైభంగా సాగింది. చక్రస్నానం అనంతరం రోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయి కాబట్టి భక్తులు ఎప్పుడైనా పుష్కరిణిలో స్నానం చేయవచ్చు.

తిరుమలపై వెలసిన శ్రీమన్నారాయణుడు తన జలక్రీడల కోసం వైకుంఠం నుంచి భువికి స్వయంగా రప్పించిన తీర్థమిదేనని నమ్ముతారు. సకల పాపనాశనిగా ఈ పుష్కరిణికి పేరుంది. తారకాసురుని సంహరించి బ్రహ్మ హత్యాదోషానికి గురైన సుబ్రహ్మణ్యస్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానంచేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. 

ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి, భూదేవికి వివరించినట్లు వరాహ పురాణం చెబుతోంది. ఇక ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలూ స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే పుష్కరిణిలో చక్రస్నానానికి అంతటి విశిష్టత ఉంది. చక్రస్నానం అనంతరం నిర్వహించే ధ్వజావరోహణతోనే బ్రహ్మోత్సవాలు ముగియడం విశేషం.
 
Follow Us:
Download App:
  • android
  • ios