కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలనే భక్తుల సౌకర్యార్థం ఏషియానెట్ న్యూస్ ప్రత్యేకంగా తిరుమల సమాచారాన్ని అందిస్తోంది. తిరుమలలో వాతావరణ పరిస్థితులు, రద్దీ, సౌకర్యాలు తదితర  విషయాల గురించి తెలుసుకోవాలంటే తాము అందించే ఈ తిరుమల సమాచారాన్ని ఫాలోకండి.   

 నిన్న అంటే సోమవారం 02.12.2019 రోజున మొత్తం 80,474 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం కల్గింది. 25,062 మంది భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. 18,277 మంది  భక్తులకు శ్రీ పద్మావతి  అమ్మవారి దర్శన భాగ్యం  కలిగింది.  సోమవారం స్వామివారి హుండీలో భక్తులు
 సమర్పించిన నగదు  రూ.3.40 కోట్లు. 

ఈ రోజు అంటే మంగళవారం 03.12.2019న  ఉదయం 7 గంటల సమయానికి తిరుమలతో వాతావరణం 19C°-23℃° గా వుంది. మంగళవారం ఉదయానికి స్వామివారి సర్వదర్శనం
 కోసం తిరుమల వైకుంఠం  క్యూకాంప్లెక్స్ రెండో గదిలో భక్తులు వేచి ఉన్నారు. ఈ సమయం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పడుతోంది. శీఘ్రసర్వదర్శనం,  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ లో రూ.300/- టిక్కెట్లు పొందినవారు), దివ్యదర్శనం (కాలినడకన వచ్చన వారు) వారికి శ్రీవారి  దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం  పట్టవచ్చని సమాచారం. 

గమనిక:  రూ.10,000/- విరాళం  ఇచ్చు శ్రీవారి భక్తులకు టిటిడి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విఐపి బ్రేక్ దర్శనభాగ్యాన్ని టిటిడి కల్పించింది.  వయోవృద్ధులు, దివ్యాంగులకు టిటిడి ప్రత్యేక ఉచిత దర్శనం కల్పిస్తోంది. వయోవృద్దులు, దివ్యాంగులు ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. వారికి ఉదయం 10 కి మరియు
 మద్యాహ్నం 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు. 
 
చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్నారై లకు కూడా టిటిడి ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేసింది. వీరికి సుపథం ప్రవేశం ద్వారా స్వామి దర్శనానికి అనుమతిస్తారు.ఉదయం 11గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.