Asianet News TeluguAsianet News Telugu

క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారా..అయితే వీటి గురించి తెలుసుకోండి: లేదంటే..

చాలా మంది క్రెడిట్ కార్డ్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకోకుండా..బ్యాంకులు పెద్దమొత్తంలో మనీలిమిట్ ఇస్తున్నాయని వాటిని వినియోగిస్తుంటారు.  తీరా ఇన్ టైంలో పే చేయకపోవడంతో బ్యాంక్ లు క్రెడిట్ స్కోర్ తగ్గుతుందని హెచ్చరిస్తుంటాయి.

How to use your credit card the right way
Author
Hyderabad, First Published Jan 12, 2020, 4:24 PM IST

చాలా మంది క్రెడిట్ కార్డ్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకోకుండా..బ్యాంకులు పెద్దమొత్తంలో మనీలిమిట్ ఇస్తున్నాయని వాటిని వినియోగిస్తుంటారు.  తీరా ఇన్ టైంలో పే చేయకపోవడంతో బ్యాంక్ లు క్రెడిట్ స్కోర్ తగ్గుతుందని హెచ్చరిస్తుంటాయి. అవసరాల నిమిత్తం క్రెడిట్ కార్డ్ ఎంత ఇంపార్టెంటో.. క్రెడిట్ కార్డ్ కి సిబిల్ స్కోర్ కూడా అంతే ఇంపార్టెంట్.

ఎందుకంటే భవిష్యత్ లో ఎలాంటి రుణాలు కావాలన్నా బ్యాంకులు క్రెడిట్ కార్డ్ స్కోర్ పై ఆధారంగా మీకు రుణాల్ని ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటాయి. అందుకే క్రెడిట్ కార్డ్ కోసం అప్లయ్ చేసినవారు, క్రెడికార్డ్ వినియోగించేవారు ఈ ఆరు టిప్స్ ఫాలో అవ్వాలని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు .

క్రెడిట్ కార్డ్ లో ఎంత ఖర్చుపెట్టాలి.

మీ దగ్గరున్న క్రెడిట్ కార్డ్ లో లిమిట్ రూ.50వేలు ఉన్నాయంటే అందులో ఓ 20వేలు ఖర్చుపెట్టాలని ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ లేకుండా ఉంటే  రూ.20 వేలు కాస్తా రూ.30వేలకు పెరిగిపోయి వచ్చే జీతంకంటే క్రెడిట్ కార్డ్ కు పే చేయాల్సిన బిల్లే ఎక్కువగా ఉంటుంది. ఇన్ టైం లో పే చేయలేక క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. క్రెడిట్ కార్డ్ ఇచ్చిన బ్యాంకులు మన ఇంటికొచ్చి వసూలు చేసుకుంటారు. కాబట్టి క్రెడిట్ కార్డ్ ను ఎంతవరకు ఖర్చు పెట్టాలనే అంశంపై ప్రణాళిక ఉండాలి.  

లిమిట్ ను క్రాస్ చేయకూడదు.

క్రెడిట్ కార్డ్ లో ఎంత అత్యవసరమైనా ఇచ్చిన లిమిట్ ను క్రాస్ చేయకూడదు. ఓ బ్యాంకు మనకు రూ.50వేల లిమిట్ తో క్రెడిట్ కార్డ్ ఇస్తే మనకు అవసరం ఉంది కదా అని రూ.60వేలు,70వేలు డ్రా చేయకూడదు. అలా చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ పూర్తిగా తగ్గిపోతుంది. పైగా అదనపు ఛార్జీలు, ఇంట్రస్ట్ లు ఇలా రకరకాల అదనపు ఛార్జీల్ని బ్యాంకులు ముక్కు పిండి వసూలు చేస్తాయి.

క్రెడిట్ కార్డ్ లో 30శాతమే ఖర్చుపెట్టాలి

కొంతమంది వినియోగదారులు మన క్రెడిట్ కార్డ్ లో లిమిట్ ఉంది కదా అని ప్రతీ నెల లిమిట్ మొత్తాన్ని ఖర్చు చేస్తుంటారు. ఇన్ టైంలో పే చేస్తుంటారు. కానీ అలా చేయడం వల్లే సమస్యలు తలెత్తుతాయని బ్యాంకులు చెబుతున్నాయి. ప్రతీ నెల 30శాతం మాత్రమే ఖర్చు పెట్టుకునేలా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నాయి. ప్రతీ నెలా మొత్తం ఖర్చు చేస్తే బ్యాంకులు మీ ఆర్ధిక స్థితిగతులను అబ్జర్వ్ చేస్తుంటాయి.

క్రెడిట్ కార్డ్ లను ఇన్ టైం లో పే చేయడం

క్రెడిట్ కార్డ్ లను ఇన్ టైంలో పే చేయాలి. ఇన్ టైంలో పే చేయకపోతే క్రెడిట్ స్కోర్ పూర్తిగా తగ్గి పోతుంది. మనం ఓ నెలలో రూ.50వేలు ఖర్చు చేస్తే మొత్తం పే చేయాలి. లేదంటే మినిమం అమౌంట్ పేచేయాలి. మొత్తం పే చేయాలి . లేదంటే 4శాతం ఇంట్రస్ట్ పే చేయాల్సి వస్తుంది.

ఏటీఎం మెషిన్ నుంచి డబ్బులు డ్రా చేయకూడదు.

చాలామంది క్రెడిట్ కార్డ్ లో ఉన్న మనీని ఏటీఎం నుంచి డ్రా చేస్తుంటారు. అలా చేయడం వల్ల బ్యాంకులు పెద్దమొత్తంలో ఇంట్రస్ట్ ను వసూలు చేస్తాయి. డబ్బులు కావాలంటే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ లేదంటే స్వైపింగ్ మాత్రమే చేసుకోవాలి లేదంటే 4నుంచి 5శాతం వడ్డీని వసూలు చేస్తుంటాయి.

క్రెడిట్ కార్డ్ వివరాల్ని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. క్రెడిట్ కార్డ్ ఐడీ , పాస్ వర్డ్ లను ఫోన్ లో సేవ్ చేసుకోవడం ద్వారా పిల్లలు ఓపెన్ చేసే కొన్ని గేముల్లో మాల్వేర్స్ ఉంటాయి. గేమ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే యాకర్స్ మాల్వేర్ సాయంతో క్రెడిట్ లో ఉన్న మనీని కాజేసే అవకాశం ఉందని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. కాబట్టి ఈ టిప్స్ తో క్రెడిట్ కార్డ్ ను జాగ్రత్తగా వినియోగించుకోండి.  

Also Read:

దిగోచ్చిన బంగారం, వెండి ధరలు...10 గ్రాములకు ఎంతంటే ?

ఎస్‌బి‌ఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.... ఇంటి నిర్మాణం.. పేరుతో కొత్త పథకం

Follow Us:
Download App:
  • android
  • ios