టెన్నిస్ స్టార్ స్టెఫీ గ్రాఫ్ కు ఫ్యాన్ ప్రపోజల్.. అదిరిపోయే రిప్లై!

స్టేఫీ కూడా నవ్వు ఆపుకోలేకపోయిందనట. తర్వాత ఆమె ‘ నీ దగ్గర డబ్బు ఎంత ఉంది?’అంటూ అభిమానిని నడగడం గమనార్హం

Wimbledon Throwback "Steffi (Graf), Will You Marry Me?" Her Epic Response

ప్రముఖ టెన్నిస్ స్టార్ స్టేపీ గ్రాఫ్ గురించి చాలా మందికి అవగాహ ఉండే ఉంటుంది. ఆమెకు ఒకప్పుడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇటీవల ఆమె తన 52వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో... ఆమెకు అభిమానులు వేలసంఖ్యలో మెసేజ్ లు పెట్టారు. శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా.. ఈ కామెంట్స్ లో ఓ వ్యక్తి గతంలో ఆమెకు ఎదురైన ప్రపోజల్ ని వీడియో రూపంలో కామెంట్ పెట్టారు.

దాదాపు 1996లో ఆమెకు ఓ అభిమాని పెళ్లి చేసుకోవాలంటూ ప్రపోజ్ చేశాడు. మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్స్ జరుగుతున్న సమయంలో స్టేడియంలోని ఓ అభిమాని.. స్టెఫీ నన్ను పెళ్లి చేసుకోవా అంటూ.. కోరాడు.  అంతే.. స్టేడియంలోని వారంతా ఒక్కసారిగా నవ్వేశారట.

 

స్టేఫీ కూడా నవ్వు ఆపుకోలేకపోయిందనట. తర్వాత ఆమె ‘ నీ దగ్గర డబ్బు ఎంత ఉంది?’అంటూ అభిమానిని నడగడం గమనార్హం. ఆమె అభిమానిని అడిగిన ప్రశ్నకు.. స్టేడియంలోని వారంతా నవ్వేశారు.

కాగా.. అప్పటి వీడియోని.. ఇప్పుడు ఆమె 52వ పుట్టిన రోజు సందర్భంగా.. కామెంట్స్ రూపంలో షేర్ చేయడం గమనార్హం. దీంతో.. ఆ వీడియో మరోసారి వైరల్ గా మారింది. వింబుల్డన్ కూడా సోషల్ మీడియా వేదికగా.. ఈ వీడియోని షేర్ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios