బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్న మార్టినా నవ్రతిలోవా...!

తాను కోలుకుంటానని.. క్యాన్సర్ పై పోరాటం చేస్తానని ఆమె ధైర్యం వ్యక్తం చేశారు. రెండు కేన్సర్లు తీవ్రమైనవే అయినా కోరుకున్న ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. వాటితో తాను పోరాడతానని ధైర్యం ప్రదర్శించారు. 

Tennis icon Martina Navratilova diagnosed with throat and breast cancer


టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా క్యాన్సర్ బారిన పడ్డారు. ఆమె గత కొంత కాలంగా గొంతు, బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలిసింది. న్యూయార్క్ లో దీనికి సంబంధించి ఆమె చికిత్స తీసుకోనున్నారు. తాను కేన్సర్ తో బాధపడుతున్నట్లు ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వివరించారు. 

మార్టినా నవ్రతిలోవా తన కెరీర్ లో 18 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ని కైవసం చేసుకుంది. కాగా... ఆమెకు 2010లోనే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ తర్వాత చికిత్సలు తీసుకోగా... కోలుకున్నారు. తిరిగి మళ్లీ ఇప్పుడు ఆమెను క్యాన్సర్ చుట్టుముట్టడం గమనార్హం. తాను కోలుకుంటానని.. క్యాన్సర్ పై పోరాటం చేస్తానని ఆమె ధైర్యం వ్యక్తం చేశారు. రెండు కేన్సర్లు తీవ్రమైనవే అయినా కోరుకున్న ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. వాటితో తాను పోరాడతానని ధైర్యం ప్రదర్శించారు. 

9 సార్లు వింబుల్డన్ చాంపియన్ అయిన మార్టినా నవ్రతిలోవా ఈ ఏడాది జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌ కోసం ఓ టెన్నిస్ చానల్‌లో కామెంటరీ చెప్పాల్సి ఉంది. అంతలోనే ఆమెకు కేన్సర్లు నిర్ధారణ కావడం అభిమానులను కలవరపరుస్తోంది. గొంతు కేన్సర్ మొదటి దశలోనే ఉందని, ఈ నెల నుంచే ఆమెకు చికిత్స ప్రారంభమవుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఆమెకు సోకిన కేన్సర్ హెచ్‌పీవీ రకమని, ఇది చికిత్సకు స్పందిస్తుందని పేర్కొన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios