నువ్వు లేకుంటే ఒక్కరోజు కూడా గడవదు.. చెల్లెలిపై సానియా స్పెషల్ పోస్ట్

తన చెల్లెలు ఆనంమీర్జాతో కలిసి నిద్రపోతున్న చిత్రాన్ని సానియా మీర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Sania Mirza Shares Birthday Post For The Person She "Can't Go A Day Without"

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన సోదరి ఆనం మీర్జాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన జీవితంలో తన సోదరి తనకు ఎంత ముఖ్యమో తెలియజేస్తూ ఆమె పెట్టిన పోస్టు అభిమానులను ఆకట్టుకుంటోంది.

‘‘నా ప్రియమైన చెల్లెలికి నాకు తెలిసిన దానికంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి, ఆనంమీర్జాకు పుట్టినరోజు శుభాకాంక్షలు...నీవు వెంట లేకుండా ఒక్కరోజు కూడా గడవదు’’ అంటూ సానియామీర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. 

తన చెల్లెలు ఆనంమీర్జాతో కలిసి నిద్రపోతున్న చిత్రాన్ని సానియా మీర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.ఆనంమీర్జా 2019లో మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసద్ ను వివాహం చేసుకుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sania Mirza (@mirzasaniar)

 

ఇద్దరు సోదరీమణులు మంచంపై పడుకున్న చిత్రాన్ని సానియా షేర్ చేశారు. దీంతోపాటు ఆనం వివాహానికి ముందు జరిగిన ఫంక్షన్ ఫొటోలు కూడా పెట్టారు. మరో చిత్రంలో తన కుమారుడు ఇజాన్,ఆనంతో కలిసి ఉన్న ఫోటోను సానియా పంచుకున్నారు. సానియా, ఆనంలు తల్లితో కలిసి ఉన్న చిత్రాన్ని కూడా పెట్టారు.ఆనం తన రక్షకురాలు అంటూ ఆమె లేకుండా వెళ్లలేని వ్యక్తిని అంటూ సానియా పేర్కొన్నారు. ఆనంమీర్జా పుట్టిన రోజు సందేశంలో ‘‘ఐ లవ్ యూ’అంటూ సానియా ముగించారు. సానియా మీర్జా పెట్టిన పోస్టుకు 50వేలమంది నెటిజన్లు లైక్ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios