ఘనంగా సానియా మీర్జా సోదరి ఆనమ్ పెళ్లి... ఫోటోలు వైరల్
మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసద్ తో ఆనం మీర్జాకి పెళ్లి జరిగింది. అసద్, ఆనం ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో... ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కింది.
ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా పెళ్లి ఘనంగా జరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కుమారుడు అసద్ తో... ఆనమ్ వివాహం జరిగింది. బుధవారం జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే నెట్టింట వైరల్ గా మారాయి.
బంధుమిత్రుల సమక్షంలో బుధవారం రాత్రి జరిగిన వీరి పెళ్లి కోలాహలంగా సాగింది. పెళ్లి అనంతరం ఆనంమీర్జా ‘మిస్టర్ అండ్ మిసెస్’ ట్యాగ్ లైన్ తో ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. పెళ్లి వేడుకలో గులాబీ రంగు లెహంగా, వైన్ రంగు భారీ దుపట్టా, బంగారు ఆభరణాలు ధరించిన ఆనంమీర్జా మెరిశారు.
వరుడు అసద్ క్రీమ్ కలర్ షెర్వానీతోపాటు తలపాగా పెట్టుకున్నారు. ఆనంమీర్జా పెట్టిన పెళ్లి ఫోటోలకు పలువురు నెటిజన్లు లైక్స్, కామెంట్లు పెట్టారు.టాలీవుడ్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఈ పెళ్లి ఫోటోలకు స్పందించారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి రెండు రోజుల క్రితం జరిగిన మెహందీ ఫంక్షన్ సందర్భంగా పెళ్లి కుమార్తె ఆనంమీర్జాకు గోరింటాకు పెట్టారు.
చేతులకు గోరింటాకు పెట్టుకొని నీలంరంగు లంగా ఓణీతో ముస్తాబైన ఆనంమీర్జాతో కలిసి దిగిన మెహందీ ఫంక్షన్ ఫొటోలను సానియామీర్జా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. ఈ ఫోటోలు కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి.
మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసద్ తో ఆనం మీర్జాకి పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. అసద్, ఆనం ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో... ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కింది.
ఆనంమీర్జా స్టైలిష్ కాగా... అసద్ న్యాయవాది. ఆనంమీర్జా ఈ పెళ్లికి సంబంధించి ఇటీవల తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘‘మంచి స్నేహితులైన కుటుంబసభ్యులను పొందుతుండటం నాకెంతో థ్రిల్‌గా, ఆనందంగా ఉంది’’ అని ఆనంమీర్జా వ్యాఖ్యానించారు. అజారుద్దీన్ కుమారుడు అసద్ తో తన చెల్లెలు ఆనంమీర్జా పెళ్లి అని సానియా మీర్జా అక్టోబరు నెలలో ప్రకటించారు.ఈ పెళ్లితో రెండు క్రీడా కుటుంబాలైన అజారుద్దీన్, సానియా మీర్జా కుటుంబాలు బంధువులుగా మారారు. ఈ పెళ్లి రిసెప్షన్ కి తెలంగాణ సీఎం కేసీఆర్ ని ప్రత్యేకంగా ఆహ్వానించారు.