హోబర్ట్: హైదరాబాద్ టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా రీఎంట్రీలో అదరగొడుతోంది. దాదాపు రెండేళ్ల విశ్రాంతి తర్వాత ఆమె టెన్నిస్ క్రీడలోకి అడుగు పెట్టింది. మాజీ నెంబర్ వన్ అయిన సానియా వరుస విజయాలతో ముందుకు సాగుతోంది. 

హోబర్ట్ అంతర్జాతీయ మహిళా టెన్నిస్ టోర్నమెంట్ ద్వారా సానియా మీర్జా రీఎంట్రీ ఇచ్చింది. ఈ టోర్నమెంటులో ఆమె వరుస విజయాలను అందుకుంటోంది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో సానియా, నదియా కిచెనోక్ (ఉక్రెయిన్) జోడీ 7-6 (3), 6-2 తేడాతో టమరా జిదాన్ సెక్ (స్లోవేనియా), మేరీ బౌడ్ కోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై విజయం సాధించింది. 

Also Read: గ్రాండ్ గా సానియా సెకండ్ ఇన్నింగ్స్....విజయం తరువాత కొడుకు ఫొటోతో ట్వీట్ వైరల్

సెమీ ఫైనల్ లో విజయం సాధించిన సానియా జోడీ ఫైనల్ లోకి దూసుకెళ్లింది. గుంటా 24 నిమిషాల పాటు సాగిన సెమీ ఫైనల్ మ్యాచులో పూర్తిగా పట్టు సాధించింది. 15 బ్రేక్ పాయింట్లు సాధించి మ్యాచుపై ఆధిపత్యం సాధించి విజయాన్ని అందుకుంది. 

2017లో చైనా ఓపెన్ లో చివరిసారి సానియా ఆడింది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ అంతర్జాతీయ టెన్నిస్ క్రీడలోకి అడుగు పెట్టింది. తల్లి కావడంతో ఇంతకాలం ఆమె టెన్నిస్ కోర్టుకు దూరంగా ఉంది. 

Also Read: సానియా ఈజ్ బ్యాక్... మళ్లీ రాకెట్ పట్టింది.

పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న సానియా మీర్జాకు ఇజహాన్ నే కుమారుడు ఉన్నాడు. రీఎంట్రీ కోసం సానియా మీర్జా చెమటోడ్చింది. అందుకు నాలుగు నెలల్లో ఏకంగా 26 కేజీల బరువు తగ్గింది. ఇది ఆమె నిబద్ధతను తెలియజేస్తుందని చెప్పవచ్చు.

Also Read: టీ20 సిరీస్... పాక్ జట్టులోకి మళ్లీ సానియా మీర్జా భర్త