టీ20 సిరీస్... పాక్ జట్టులోకి మళ్లీ సానియా మీర్జా భర్త

15 మంది సభ్యులతో కూడిన పాక్‌ జట్టులో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ షోయబ్‌ మాలిక్‌, మహ్మద్‌ హఫీజ్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు. అంతేకాకుండా అన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్‌ హారిస్‌ రౌఫ్‌, అహ్సన్‌ అలీలను కూడా ఎంపిక చేశారు.

Shoaib Malik, Mohammad Hafeez return to Pakistan squad for T20 series against Bangladesh

పాకిస్తాన్ జట్టు... బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ కోసం తలపడేందుకు సన్నద్ధమౌతోంది. ఇప్పటికే జట్టును కూడా ఆ దేశ సెలక్టర్లు ప్రకటించారు. కాగా... ఈ జట్టులోకి అనూహ్యంగా పాక్ మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్, భారత టెన్నిస్ క్రీడాకారిణి భర్త షోయబ్ మాలిక్ కి చోటు దక్కింది.

15 మంది సభ్యులతో కూడిన పాక్‌ జట్టులో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ షోయబ్‌ మాలిక్‌, మహ్మద్‌ హఫీజ్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు. అంతేకాకుండా అన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్‌ హారిస్‌ రౌఫ్‌, అహ్సన్‌ అలీలను కూడా ఎంపిక చేశారు. అయితే సీనియర్‌ బౌలర్లు మహ్మద్‌ అమిర్‌, వాహబ్‌ రియాజ్‌లను జట్టు నుంచి తప్పించడం గమనార్హం. గత కొంత కాలంగా ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న మాలిక్‌ పాక్‌ జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలోనే వన్డేలకు గుడ్‌బై చెప్పిన మాలిక్‌ టీ20ల్లో కొనసాగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే.  సడెన్ గా మళ్లీ షోయబ్ కి జట్టులో చోటు దక్కడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

Also Read భారత్ తో టీ20 సిరీస్... మ్యాచ్ కి ముందే కివీస్ కి షాక్...

పాకిస్తాన్‌ క్రికెట్‌ను గాడిన పెట్టేందుకు చర్యలు ప్రారంభించామని, దీనిలో భాగంగానే జట్టులో మార్పులు చేపట్టామని ఆ దేశ ప్రధాన కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌ మిస్బావుల్‌ హక్‌ పేర్కొన్నాడు.ఇక మాలిక్‌ ఎంపిక పట్ల పాక్‌ అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురువుతున్నారు. ‘ఏంటి మాలిక్‌ను ఎంపిక చేశారా?’, ‘వావ్‌ ఇట్స్‌ అమేజింగ్‌.. మాలిక్‌ పాక్‌ జట్టులోకి వచ్చాడా!’అంటూ పాక్‌ ఫ్యాన్స్‌ సరదాగా కామెంట్‌ చేస్తున్నారు.   

Shoaib Malik, Mohammad Hafeez return to Pakistan squad for T20 series against Bangladesh

పాకిస్తాన్‌ టీ20 జట్టు:
బాబర్‌ అజమ్‌(సారథి), అహ్సన్‌ అలీ, అమద్‌ బట్‌, హారీస్‌ రౌఫ్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, ఇమాద్‌ వసీమ్‌, కౌష్దిల్‌ షా, మహ్మద్‌ హఫీజ్‌, మహ్మద్‌ హస్నైన్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, ముసా ఖాన్‌, షాదాబ్‌ ఖాన్‌, షహీన్‌ షా ఆఫ్రిది, షోయబ్‌ మాలిక్‌, ఉస్మాన్‌ ఖాదిర్‌. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios