ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం: నయా ఛాంపియన్‌గా యువ క్రీడాకారిణీ
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో సంచలనం నమోదైంది. అమెరికాకు చెందిన యువ క్రీడాకారిణి సోఫియా కెనిన్ సరికొత్త ఛాంపియన్‌గా అవతరించారు. శనివారం జరిగిన ఫైనల్స్‌లో గార్బైన్ ముగురుజాతో జరిగిన మ్యాచ్‌లో 4-6, 6-2, 6-2 తేడాతో ఓడించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

తద్వారా ఈ మహిళల సింగిల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ అందుకున్న లఅతి పిన్న వయస్కురాలిగా రికార్డుల్లోకి ఎక్కింది. రష్యన్ స్టార్ ప్లేయర్ మారియా షరపోవా 2008లో 20 ఏళ్ల 283 రోజుల్లో ఈ ఘనత సాధించగా.. కెనిన్ 21 ఏళ్ల 80 రోజుల వయసులో తొలి గ్రాండ్ స్లామ్ అందుకుంది.
కాగా రెండు సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్‌గా నిలిచిన ముగురుజాతో దాదాపు రెండు గంటల పాటు కెనిన్ తలపడింది. తొలి రౌండ్‌లో వెనుకబడిన గార్బైన్.. తర్వాత పుంజుకుని వరుస రౌండ్లలో ఆధిపత్యం వహించింది. తొలి గ్రాండ్ స్లామ్‌ను సాధించిన తర్వాత కెనిన్ మాట్లాడుతూ.. తన కల నెరవేరిందని, ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని చెప్పింది.
Also Read:
హార్దిక్ పాండ్యాకు షాక్: కివీస్ పై టెస్టు జట్టులో నో చాన్స్
కివీస్ పై చివరి టీ20: రాహుల్, కోహ్లీలకు రెస్ట్, రిషబ్ పంత్ కు చాన్స్