తల్లైన టెన్నిస్ తార మరియా షరపోవా..!
తన కుమారుడు పేరు కూడా ఆమె ప్రకటించారు. తమ ముద్దుల కుమారుడికి థియోడర్ అనే పేరు పెట్టినట్లు ఆమె తెలిపారు. రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 2020లో నిశ్చితార్థం చేసుకున్నారు.
మాజీ ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ తార మరియా షరపోవా తల్లయ్యారు. ఇటీవల ఆమె తన బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసి.. తల్లికాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా తాను తల్లి అయినట్లు ఆమె ప్రకటించారు. తన భర్త అలెగ్జాండర్ గిల్క్స్‌తో తాను కుమారుడికి జన్మనిచ్చినట్లు ఆమె ప్రకటించారు.
అప్పుడే పుట్టిన తన చిన్నారి, తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కుమారుడు పేరు కూడా ఆమె ప్రకటించారు. తమ ముద్దుల కుమారుడికి థియోడర్ అనే పేరు పెట్టినట్లు ఆమె తెలిపారు. రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 2020లో నిశ్చితార్థం చేసుకున్నారు.
ఏప్రిల్ 19వ తేదీ తన 35వ పుట్టిన రోజున ఆమె తాను గర్భవతిని అంటూ ప్రకటించారు. త్వరలోనే తమ కుటుంబంలోకి మరొకరు రాబోతున్నట్లు ఆమె ప్రకటించారు. ఆమె పెట్టిన పోస్టుకు నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తోంది. షరపోవా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 2020లో ఆస్ట్రేలియా ఓపెన్ ఆడిన తర్వాత టెన్సిస్ ప్రపంచానికి వీడ్కోలు పలికింది. ఆమె రిటైర్మెంట్ పట్ల అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. షరపోవా 2004లో 17 ఏళ్ల వయసులో వింబుల్డన్‌లో తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకుంది. 2012లో ఫ్రెంచ్ ఓపెన్‌లో కెరీర్ స్లామ్ విజయాన్ని కూడా పూర్తి చేసింది.
2012 తర్వాత 2014లో ఫ్రెంచ్ ఓపెన్‌ని కూడా కైవసం చేసుకుంది. ఆమె 2006లో US ఓపెన్, 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుపొందడంలో విజయం సాధించింది. 2016లో డోపింగ్ కారణంగా షరపోవాపై 15 నెలల నిషేధం విధించారు. ఏప్రిల్ 2017లో తిరిగి వచ్చింది.