మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ వద్ద పోలీసులమని చెప్పి మహిళపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన  దుండగుల్లో ఒకరు  రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.

కర్ణాటక రాష్ట్రంలోని బీధర్  నుండి  సూర్యాపేటకు వెళ్తున్న బస్సులో ఓ మహిళ బ్యాగులో  నిషేధిత వస్తువులు ఉన్నాయంటూ దుండగులు ఆమెను బస్సును నుండి కిందకు దించారు. గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తోందని మహిళపై దుండగులు ఆరోపణలు చేశారు. అంతేకాదు తాము పోలీసులమని బెదిరించి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు.  

Also read:పోలీసులమని, లగేజ్ చెక్‌ చేయాలని చెప్పి: మహిళపై అత్యాచారం

ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి  అత్యాచారయత్నానికి ప్రయత్నించారు.  బాధిత మహిళ ఈ విషయమై పోలీసులకు పిర్యాదు చేసింది. సీసీటీవీ పుటేజీ  దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు పోలీసులు.

బుధవారం నాడు  మధ్యాహ్నం నిందితులు ఉపయోగించిన కారును వెంబడించారు. పోలీసులను చూసిన నిందితులు కారును వేగంగా నడిపారు.  ఈ క్రమంలో కారు అదుపుతప్పి బోత్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందాడు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. 

ఉమ్మడి మెదక్ జిల్లా  రాయికోడ్ మండలం మహాభూత్పూరు వద్ద నిందితులు పోలీసులను చూసి వేగంగా కారును నడిపారు. కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఒక నిందతుడు అక్కడికక్కడే మృతి చెందాడు. 

ఈ గ్యాంగ్‌లో ఇంకా కొందరు ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు .గాయపడిన నిందితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నిందితుడికి చికిత్స చేసిన తర్వాత పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. 

మంగళవారం నాడు సాయంత్రం బాధిత మహిళ ఫిర్యాదు చేసిన సమయం నుండి పోలీసులు సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. మంగళవారం నాడు రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే మహాభూత్పూరు వద్ద నిందితులు తారసపడ్డారు. సీఐ ను చూసిన నిందితులు కారును మరింత వేగంగా ముందుకు నడిపారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు చెప్పారు.