Asianet News TeluguAsianet News Telugu

మీరు రైతే కదా.. ఆత్మహత్యలెందుకో తెలియదా, కమిటీ ఎందుకు: కేసీఆర్‌పై షర్మిల ఆగ్రహం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల మండిప‌డ్డారు. రైతుల‌ను ఆదుకోకుండా వారిని క‌న్నీటిలో ముంచుతున్నార‌ని ఆమె ఆరోపించారు. 'రైతుల‌కు పెట్టుబడి రాకపోతే, పండిన పంట వరద పాలైతే, ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తే, రైతు చావక ఇంకేం చేస్తాడు దొరా?' అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

ysrtp president ys sharmila slams telangana cm kcr over farmers suicides
Author
Hyderabad, First Published Sep 30, 2021, 2:21 PM IST

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల మండిప‌డ్డారు. రైతుల‌ను ఆదుకోకుండా వారిని క‌న్నీటిలో ముంచుతున్నార‌ని ఆమె ఆరోపించారు. 'రైతుల‌కు పెట్టుబడి రాకపోతే, పండిన పంట వరద పాలైతే, ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తే, రైతు చావక ఇంకేం చేస్తాడు దొరా?' అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

'కేసీఆర్ ఒక్క రైతు బంధు ఇచ్చిండు. ఫసల్ బీమా బంద్ పెట్టిండు. పంటలకు బీమా లేదు, రైతుకు ధీమా లేదు, పంటలు వాన పాలు. కష్టం నీటి పాలు. రైతును కన్నీటిలో ముంచిండు' అని ష‌ర్మిల చెప్పారు. 'తాను పెద్ద రైతును అని చెప్పుకొనే దొరగారికి రైతు ఆత్మహత్యలు ఎందుకు చేసుకొంటున్నారో తెలియదట .. అందుకే కమిటీ వేసిండు. కోర్టులు మొట్టి కాయలు వేయనిదే మీకు ఏ పని చేయాలనే సోయి రాదు కానీ.. కనీసం ఇప్పటికైనా పంటల బీమాను అమలు చేసి రైతులను ఆదుకోండి' అని వైఎస్ ష‌ర్మిల డిమాండ్ చేశారు

Follow Us:
Download App:
  • android
  • ios