Asianet News TeluguAsianet News Telugu

నోటిఫికేషన్లు రావాలంటే .... ఇంకెంతమంది నిరుద్యోగులు చనిపోవాలి: కేసీఆర్‌పై షర్మిల విమర్శలు

ఇంకా ఎంత మంది నిరుద్యోగులు చనిపోతే నోటిఫికేషన్లు విడుదల చేస్తారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఇప్పటికే వందల మంది నిరుద్యోగులు చనిపోయారు అని ఆమె విమర్శలు గుప్పించారు. తల్లులు చేతికందిన కొడుకులను కోల్పోయి గర్భశోకం అనుభవిస్తే మీ కండ్లు చల్లబడుతాయా అంటూ ఎద్దేవా చేశారు.

ysrtp president ys sharmila made sensational comments on kcr
Author
Hyderabad, First Published Aug 24, 2021, 3:38 PM IST

దండేపల్లి మండలం కేంద్రంలోని లింగాపూర్ గ్రామంలో వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్.. రోజుకో నిరుద్యోగి హత్యతో రాక్షసానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగం రావట్లేదని తీవ్ర నిరాశకు గురైన లింగాపూర్ గ్రామానికి చెందిన భూక్య నరేష్ (26) ఆత్మహత్య చేసుకున్నాడని వచ్చిన వార్తను ఈ సందర్భంగా షర్మిల ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా నరేష్‌ను ప్రభుత్వం పొట్టనపెట్టుకుందని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ఇంకెంత మందిని పొట్టన పెట్టుకుంటారని షర్మిల ప్రశ్నించారు. ఇంకా ఎంత మంది నిరుద్యోగులు చనిపోతే నోటిఫికేషన్లు విడుదల చేస్తారు.? ఇప్పటికే వందల మంది నిరుద్యోగులు చనిపోయారు అని ఆమె విమర్శలు గుప్పించారు. తల్లులు చేతికందిన కొడుకులను కోల్పోయి గర్భశోకం అనుభవిస్తే మీ కండ్లు చల్లబడుతాయి? ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేయడానికేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెంటనే రాజీనామా చేసి.. ముక్కు నేలకి రాసి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి నువ్వు ఇంకా మనిషివే అని నిరూపించుకో కేసీఆర్ అని షర్మిల పేర్కొన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios