Asianet News TeluguAsianet News Telugu

రైతు కష్టం వానల్లో కొట్టుకుపోతోంది.. నీకు మనసొస్తలేదా : కేసీఆర్‌పై షర్మిల ఆగ్రహం

రైతు కష్టం వానల్లో కొట్టుకుపోతుంటే.. వారిని ఆదుకునేందుకు కేసీఆర్‌కు మనసొస్తలేదా అని ప్రశ్నించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తడిసిన ధాన్యానికి కొర్రీలు పెట్టకుండా వారిని ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. 

ysrtp president ys sharmila fires on telangana cm kcr over farmers issue
Author
Hyderabad, First Published May 17, 2022, 5:47 PM IST

తెలంగాణ ప్రభుత్వం (telangana govt) , సీఎం కేసీఆర్‌పై (kcr) మండిపడ్డారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ (ysr telangana party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (ys sharmila) . రైతులు (farmers) పండించిన ధాన్యం అకాల వ‌ర్షాల‌కు త‌డిసిపోతోంటే అన్న‌దాత‌ల‌ను స‌ర్కారు ఎందుకు ఆదుకోవ‌ట్లేద‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఈ మేరకు మంగళవారం షర్మిల వరుస ట్వీట్లు చేశారు. 

''రైతుల కష్టం వానల్లో కొట్టుకుపోతుంటే, చెమటోడ్చి పండించిన పంట కాలువల్లో తేలిపోతుంటే, చేతులతో ఎత్తుకోలేక, కల్లాల్లో రైతు కన్నీరు పెడుతుంటే కేసీఆర్‌ దొరగారికి రైతుల కష్టాలు కనపడ్తలేవా? గడి గడపదాటి బయటకొచ్చి రైతును ఆదుకునేందుకు మనసొస్తలేదా? రైతు గోస వినపడ్తలేదా? చేతగాక పెడచెవిన పెడుతున్నావా?

లేక మొద్దునిద్ర పోతున్నావా? అప్పులు తేవడానికి అధికారులను పరుగులు పెట్టిస్తున్న మీరు పంట కొనాల‌ని అధికారులను ఎందుకు కల్లాలకు పంపడం లేదు? ఇప్పటికైనా రైతును గోస పెట్టకుండా, తడిసిన ధాన్యానికి కొర్రీలు పెట్టకుండా, కల్లాల్లో ధాన్యాన్ని మద్దతు ధరిచ్చి అంతా కొనాలని డిమాండ్ చేస్తున్నాం'' అని ష‌ర్మిల పేర్కొన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios