నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆదివారం ఆందోళనకు దిగారు.   గిరిజన మహిళ లక్ష్మీకి తక్షణమే న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆదివారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. గిరిజన మహిళ లక్ష్మీకి తక్షణమే న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ఆందోళనకారులపై లాఠీఛార్జీ చేశారు. అనంతరం వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred