బీఆర్ఎస్‌లో వైఎస్సార్టీపీ విలీనం!.. లీడర్లు, క్యాడర్‌ను స్వాగతించిన మంత్రి హరీశ్ రావు

వైఎస్ షర్మిలా రెడ్డి పార్టీ వైఎస్సార్టీపీకి చెందిన లీడర్లు పెద్దమొత్తంలో బీఆర్ఎస్‌లో చేరారు. లీడర్లు, క్యాడర్‌ను మంత్రి హరీశ్ రావు స్వాగతించారు. దీంతో బీఆర్ఎస్‌లో వైఎస్సార్టీపీని విలీనం అయినట్టుగానే కథనాలు వస్తున్నాయి.
 

YSRTP merged in BRS party, majority leaders joined, minister harish rao welcomes kms

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ఉధృతంగా సాగుతున్నది. ఈ ఎన్నికల్లో టీ టీడీపీ, వైఎస్సార్టీపీలు పోటీ చేయాలని అనుకుని వెనుకడుగు వేశాయి. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో పోటీ వద్దని చెప్పడంతో కాసాని తీవ్ర అసంతృప్తికి లోనై ఆ తర్వాత బీఆర్ఎస్‌లోకి అనుచరులతో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైఎస్సార్టీపీ వంతు అనిపిస్తున్నది. వైఎస్సార్టీపీ నుంచి పలు నేతలు, అన్ని జిల్లాల కోఆర్డినేటర్లు, కార్యకర్తలు, గట్టు రాంచదర్ రావు ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. వీరందరికి గులాబీ కండువాలు కప్పి రాష్ట్రమంత్రి హరీశ్ రావు స్వాగతం పలికారు.

తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీ చేయడం లేదని, కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్టు వైఎస్ షర్మిలా రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి వరకు ఎన్నికల బరిలో దిగాలని ఉవ్విళ్లూరినవాళ్లంతా నిరాశలోకి జారిపోయారు. వారంతా ప్రత్యామ్నాయ వేదిక కోసం వెతుకులాట ప్రారంభించారు. తాజాగా, పెద్ద ఎత్తున వైఎస్సార్టీపీ లీడర్లు, క్యాడర్ బీఆర్ఎస్‌లో చేరింది. షర్మిల పార్టీకి రాజీనామా చేసిన ఈ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పార్టీని బీఆర్ఎస్‌లో విలీనం చేయాలని నిశ్చయానికి వచ్చారు. సీఎం కేసీఆర్‌తో రాష్ట్ర సుభిక్షంగా ఉంటుందని నమ్మే ఈ పార్టీలో చేరుతున్నట్టు వారంతా చెప్పారు.

Also Read: సీపీఐ, సీపీఎం ప్రత్యర్థులా? మిత్రపక్షాలా? పాలేరు సీటుపై వామపక్షాల ఓట్లు ఎటు?

పెద్ద మొత్తంలో క్యాడర్ బీఆర్ఎస్‌లో చేరడంతో వైఎస్సార్టీపీ గులాబీ పార్టీలో విలీనం అయిందని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎష్ షర్మిల స్పందించాల్సి ఉన్నది. నిజానికి ఎన్నికలకు ముందు వరకు వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ, వైఎస్ షర్మిలను తెలంగాణలో కాకుండా ఏపీలో వైఎస్ జగన్ పైనే ఉపయోగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్టు సమాచారం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios