Asianet News TeluguAsianet News Telugu

ప్రజల కోసం పోరాడే పార్టీ వైఎస్సార్టీపీ మాత్ర‌మే.. : వైఎస్ షర్మిల

Hyderabad: 2022లో వైఎస్సార్టీపీ అనేక అంశాలపై పోరాడి ప్రశ్నించే గొంతుకగా మారిందని ఆ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల అన్నారు. రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర సందర్భంగా పార్టీ అన్ని వర్గాల సమస్యలను లేవనెత్తి పాలకుల అవినీతిని ప్రశ్నించిందని కూడా పేర్కొన్నారు.
 

YSRTP is the only party that fights for the people.. : YS Sharmila
Author
First Published Jan 2, 2023, 3:06 PM IST

YSRTP President YS Sharmila: తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ ) అనీ, అది ప్రజల పక్షాన నిలుస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల  అన్నారు. 2022లో వైఎస్సార్టీపీ అనేక అంశాలపై పోరాడి ప్రశ్నించే గొంతుకగా మారిందని ఆ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల అన్నారు. రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర సందర్భంగా పార్టీ అన్ని వర్గాల సమస్యలను లేవనెత్తి పాలకుల అవినీతిని ప్రశ్నించిందని కూడా పేర్కొన్నారు. "ఎన్ని కుట్రలు చేసినా ప్రజల పక్షాన పోరాడాం.. వైఎస్‌ఆర్‌టీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన ముందుకుసాగుతుంది" అని షర్మిల తన నూతన సంవత్సర సందేశంలో పేర్కొన్నారు. 2023లో పేదల బతుకులు మారాలని, వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలని ఆమె ఆకాంక్షించారు.

ట్విట్ట‌ర్ లో  YSRTP #2023TelanganaKCRfree అనే హ్యాష్‌ట్యాగ్ తో త‌న సందేశాన్ని పంచుకున్నారు. "ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ YSRTP. 2022వ సంవత్సరంలో అనేక సమస్యలపై పోరాడి ప్రశ్నించే గొంతుకైంది. పాదయాత్రలోనూ అన్ని వర్గాల సమస్యలు, పాలకుల అవినీతి అక్రమాలపై ప్రశ్నించాం. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరుఫున పోరాడాం. ఇక ముందు కూడా YSRTP ప్రజల పక్షమే.." అంటూ ఆమె పేర్కొన్నారు. 

అంత‌కుముందు ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. "పైన పటారం.. లోన లోటారం.. ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ" అన్నట్లుంది రాష్ట్ర పరిస్థితి. దొర చేసిన  అప్పులకు రాష్ట్ర ఆదాయం కిస్తీలకే మిగలట్లే. రాష్ట్రం సిద్ధించిన నాటికి సంపద 16వేల కోట్లు. ఇప్పుడు అప్పు 4.50లక్షల కోట్లు. దొర చేసిన అప్పులకు ఎనిమిదిన్న‌ర ఏండ్లుగా కట్టిన వడ్డీ లక్ష కోట్లు" అంటూ విమ‌ర్శ‌ల దాడిని కొన‌సాగించారు. 

అలాగే, "ఇంత అప్పు చేసినా జనానికి ఒరిగింది మాత్రం సున్నా. ఆరోగ్యశ్రీకి డబ్బుల్లేవ్. ఫీజు రీయింబర్స్ మెంట్ కు పైసల్ లేవ్. ఏ పథకానికి నిధుల్లేవ్. ఆఖరికి ఉద్యోగుల జీతాలకు కూడా అతీగతీ లేదు. తిన్నది కల్వకుంట్ల కుటుంబం.. కట్టేది జనం. మీ పార్టీ అకౌంట్ లో 860కోట్లకు వడ్డీలు మీరు తినాలే..! " అంటూ పైర్ అయ్యారు. "రాష్ట్ర అప్పులకు వడ్డీలు జనాలు కట్టాల్నా? ధనిక రాష్ట్రం అంటూనే జనాలను జలగల్లా పీల్చుకుతింటుండు దొర. చక్ర వడ్డీలతో చక్రం తిప్పి, ఒక్కో నెత్తిన లక్షన్నర అప్పు పెట్టి, రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసి.. బంగారు తెలంగాణ చేశాననీ, ఇక బంగారు భారత్ చేస్తానంటూ దేశాన్ని దోచుకోడానికి పోతుండు" అంటూ సెటైర్లు వేశారు.  

సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వడంలో స్పష్టమైన అపోహలు, అవినీతి, ప్రభుత్వ ఉన్నత వైఖరి, రాజకీయం పట్ల కేసీఆర్ కు ఉన్న వ్యామోహం ఇవన్నీ కలిపితే తెలంగాణ వైఫల్యాలకు నేపథ్యం ఏర్పడిందని వైయస్సార్ తెలంగాణ పార్టీ పేర్కొంది. ఉదాహరణకు, అక్షరాస్యతలో రాష్ట్రం 4 వ స్థానంలో ఉంది.. పాఠశాలల మౌలిక సదుపాయాలు, పనితీరులో అధ్వాన్నమైన ఐదు రాష్ట్రాలలో ఒకటిగా ఉంద‌ని పార్టీ పేర్కొంది. "రైతు, యువకుల ఆత్మహత్యలు, కౌలు రైతుల అప్పులు, నిరుద్యోగంలో తెలంగాణ విచారకరమైన చిత్రాన్ని ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో భారీ రుణ భారం.. పెరుగుతున్న ఆర్థిక లోటు, ప్రతి పౌరుడిపై పెనుభారం మోపుతోంది" అని పార్టీ పేర్కొంది. కేసీఆర్ పాలనపై అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నామని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పేర్కొంది. పార్టీ అధికారంలోకి వస్తే దివంగత వైఎస్‌ఆర్‌ సంక్షేమం, ప్రగతి స్వర్ణయుగాన్ని తిరిగి తీసుకువస్తామని ష‌ర్మిల ప్ర‌జ‌ల‌కు భరోసా ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios