తెలంగాణానా ఆఫ్ఘనిస్తానా, కేసీఆర్ ఓ తాలిబన్: మద్దతిచ్చినవారికి షర్మిల ధన్యవాదాలు

పాలకపక్ష ఆగడాలు పతాకస్థాయికి  చేరినప్పుడు నిలదీయడం అందరి కర్తవ్యమని  వైఎస్ఆర్‌టీపీ  చీఫ్  వైఎస్  షర్మిల చెప్పారు. తన పోరాటానికి మధ్దతు తెలిపిన వారికి  షర్మిల ధన్యవాదాలు తెలిపారు.
 

YSRTP Chief  YS  Sharmila  Thanks To  Union Minister  Kishan Reddy and other leaders

హైదరాబాద్: పాలకపక్ష ఆగడాలు పతాకస్థాయికి  చేరినప్పుడు  నిలదీయడం అందరి కర్తవ్యమని  వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్  వైఎస్ షర్మిల చెప్పారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయినప్పుడు పార్టీలకు అతీతంగా  నిలదీయాల్సిన అవసరం  ఉందని షర్మిల  అభిప్రాయపడ్డారు. ట్విట్టర్ వేదికగా  షర్మిల స్పందించారు.  తన పోరాటానికి  మద్దతు ప్రకటించిన  కేంద్ర మంత్రి కిషన్  రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  , మాజీ  మంత్రులు జీవన్ రెడ్డి, కొండా సురేఖలకు  ఆమె ధన్యవాదాలు తెలిపారు.

 

టీఆర్ఎస్  పై  షర్మిల తీవ్రంగా  విమర్శలు చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా  ఇవాళ  కూడా  ఆమె  మరోసారి  విమర్శలు  గుప్పించారు. ఒకప్పుడు టీఆర్ఎస్  ఉద్యమ పార్టీ, ఇప్పుడు గూండాల,  బంధిపోట్ల పార్టీ అంటూ  ఆమె  విమర్శలు చేశారు. మహిళగా  తాను  3500 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేస్తే ఓర్వలేక దాడులు నిర్వహిస్తున్నారని ఆమె  టీఆర్ఎస్  పై మండిపడింది.ప్రజల పక్షాన పోరాటాలు చేయడం తప్పా అని  ఆమె అడిగారు.  తెలంగాణా, అఫ్ఘనిస్తానా అని  ఆమె ప్రశ్నించారు.

 

కేసీఆర్  ఓ తాలిబాన్  అంటూ ఆమె  విమర్శించారు. హైద్రాబాద్, నర్సంపేటలలో  శాంతిభద్రతలసమస్యలు సృష్టించింది  టీఆర్ఎస్  గూండాలేనన్నారు.పోలీసులు టీఆర్ఎస్  కు అనుకూలంగా  వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు.దాడులు చేసే హక్కు పోలీసులకు ఎక్కడిదని  ఆమె  అడిగారు.ఇవాళ  ఉదయం  వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్ షర్మిలపై టీఆర్ఎస్  ఎమ్మెల్సీ కవిత  సెటైర్లు వేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios