YS Sharmila deeksha: ఇందిరా పార్క్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు శనివారం వైఎస్ షర్మిల(YS Sharmila) ఇందిరా పార్క్ వద్ద దీక్ష ప్రారంభించారు. సాయంత్రం 6 గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద ఆమె దీక్షను కొనసాగిస్తారు. అనంతరం లోటస్ పాండ్‌లోని వైఎస్సార్‌టీపీ పార్టీ కార్యాలయంలో మిగిలిన దీక్షను పూర్తి చేయనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు శనివారం వైఎస్ షర్మిల(YS Sharmila) ఇందిరా పార్క్ వద్ద దీక్ష ప్రారంభించారు. తెలంగాణ రైతులకు అండగా నిలిచేందుకు రైతు వేదన ( raithu vedana) పేరుతో 72 గంటల పాటు షర్మిల దీక్షను కొనసాగించనున్నట్టుగా వైఎస్సార్‌టీపీ పార్టీ ప్రతినిధులు తెలిపారు. అయితే పోలీసుల అనుమతులు దొరకని నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద ఆమె దీక్షను కొనసాగిస్తారు. అనంతరం లోటస్ పాండ్‌లోని వైఎస్సార్‌టీపీ పార్టీ కార్యాలయంలో మిగిలిన దీక్షను కొనసాగిస్తారు.
Telanganaలో వరి పంటపై రాజకీయం జోరుగా నడుస్తున్నది. వరి ధాన్యాన్ని(Paddy) కేంద్ర ప్రభుత్వం సేకరించబోమని అంటున్నదని, పంజాబ్ తరహాలోనే తెలంగాణలోనూ పంటను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. ఇదే అంశం ప్రధానంగా రాష్ట్రం వర్సెస్ కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేయాలని CM KCR లేఖ రాస్తే తాము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని రాష్ట్ర బీజేపీ సమాధానం ఇస్తున్నది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయాలతో రైతు నష్టపోతున్నాడని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా షర్మిల రైతుల నుంచి ప్రభుత్వమే పూర్తిగా వరి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో 72 గంటల దీక్షకు దిగారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్.. షర్మిల పాదయాత్ర వాయిదా..
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది. 21 రోజుల్లో సాగిన యాత్రలో షర్మిల.. ఆరు నియోజకవర్గాల్లోని 150 గ్రామాలను సందర్శించినట్లు పేర్కొంది. రాష్టంలో సమస్యలే లేవని పాలకులు చెబుతున్నారని, కానీ తన పాదయాత్రలో ప్రజలు ఎన్నో సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని షర్మిల చెప్పారు. యాసంగిలో వరి ధాన్యం కోనుగోలు చేయబోమని కేసీఆర్ ప్రకటించడం ఎంత వరకు సబబు అని ఆమె ప్రశ్నించారు.