వరి పండించని రైతులకు కేసీఆరే పరిహారం చెల్లించాలి: వైఎస్ షర్మిల డిమాండ్
వరి పంట పండించకుండా నష్టపోయిన రైతులకు కేసీఆర్ తన స్వంత డబ్బులను పరిహారంగా చెల్లించాలని YSRTP చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కేసీఆర్ సూచన మేరకు రైతులు వరి పంట పండించలేదని ఆమె చెప్పారు.
హైదరాబాద్: Paddy పంట వేయకుండా నష్టపోయిన రైతులకు KCR తన స్వంత డబ్బులను పరిహారంగా చెల్లించాలని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.ఆదివారం నాడు వైఎస్ఆర్‌టీపీ చీఫ్ YS Sharmila మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చాలా మంది రైతులకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదన్నారు.
.పంటను పండించిన Farmersకు వాటిని అమ్మడమే పెద్ద సమస్య అని ఆమె చెప్పారు. కేసీఆర్ మాటలకు రాష్ట్రంలో సుమారు 17 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంట వేయలేదన్నారు. ఈ రైతులంతా వరి వేయకుండా నష్టపోయారని ఆమె చెప్పారు. వరి పండించకుండా నష్టపోయిన రైతులకు కేసీఆర్ సర్కార్ ఏం చేస్తుందని ఆమె ప్రశ్నించారు. ఈ రైతులకు కేసీఆర్ స్వంతంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. TRS పార్టీకి బ్యాంకుల్లో రూ.800 కోట్లకు పైగా నిధులు ఉన్నాయని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ నిధుల్లో నుండి వరి పండించకపోయినా రైతులకు పరిహారం చెల్లించాలని షర్మిల డిమాండ్ చేశారు.ఎకరానికి రూ. 30 వేల చొప్పున చెల్లించాలని ఆమె కోరారు.
వరి వేసుకున్న రైతులకు ఉరే అని కేసీఆర్ చెప్పిన మాటలకు కట్టుబడి రైతులు వరి వేయలేదని ఆమె గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం వరి వేసిన రైతుల నుండి వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు.
వరికి క్వింటాల్ కి రూ. 1960 ధరను ఒకరో ఇద్దరికో ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. మిగిలిన రైతులకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదన్నారు. తాలు, తేమ, నాసిరకం ధాన్యం అంటూ మద్దతు ధరను ఇవ్వడం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల విషయంలో ప్రభుత్వం ఎందుకు ఉదారంగా ఖర్చు పెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. వరి రైతులకు మద్దతుధరతో పాటు 20 శాతం బోనస్ ను కూడా చెల్లించాలని షర్మిల డిమాండ్ చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో షర్మిల పాదయాత్ర సాగుతుంది. పాదయాత్ర సందర్భంగా ఆమె వరి వేసుకొన్న రైతులను కలిశారు. అదే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని షర్మిల విమర్శలు చేశారు.
రాష్ట్రంలో వరి పండించిన రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గత నెల 15న నిర్ణయం తీసుకొంది. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 1960. సాధారణ ధాన్యానికి క్వింటాల్ కి రూ. 1940 చెల్లించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నుండి సానుకూల స్పందన రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకొంది.
ఇతర రాష్ట్రాల నుండి వరి ధాన్యం రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంది. ఈ మేరకు సరిహద్దుల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల ధాన్యం వాహనాలను రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. వరి ధాన్యం విషయంలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధ: సాగిన విషయం తెలిసిందే.