Asianet News TeluguAsianet News Telugu

119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ, నాలుగు నెలలుగా ఎదురుచూశా:కాంగ్రెస్‌లో విలీనంపై షర్మిల

రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని  వైఎస్ఆర్‌టీపీ నిర్ణయం తీసుకుంది.  పాలేరు నుండి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. 

 YSRTP Chief YS Sharmila Decides to contest 119 Assembly segments in Telangana Elections lns
Author
First Published Oct 12, 2023, 3:49 PM IST | Last Updated Oct 12, 2023, 4:45 PM IST


హైదరాబాద్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని  వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్  వైఎస్ షర్మిల చెప్పారు.గురువారం నాడు  వైఎస్ఆర్‌టీపీ  రాష్ట్ర కార్యవర్గ సమావేశం  హైద్రాబాద్ లోని లోటస్ పాండ్ లో జరిగింది.ఈ సమావేశంలో  వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పోటీ చేయాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మాణం చేశారు. పాలేరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నట్టుగా షర్మిల ప్రకటించారు. పాలేరుతో పాటు మరో అసెంబ్లీ స్థానం నుండి కూడ పోటీ చేయాలనే డిమాండ్ ఉందని  షర్మిల  వివరించారు.

 వైఎస్ విజయమ్మ, అనిల్ పోటీ చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారన్నారు.  అవసరమైతే విజయమ్మ పోటీ చేస్తారని షర్మిల చెప్పారు. కాంగ్రెస్ తో వెళ్తే వ్యతిరేక ఓటు చీలదనుకున్నామన్నారు.బీఆర్ఎస్ కు లాభం జరగవద్దని కోరుకున్నానని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ తో చర్చలు జరిపాం.. నాలుగు నెలలు ఎదురు చూసినట్టుగా  వైఎస్ షర్మిల వివరించారు. కాంగ్రెస్ లో వైఎస్ఆర్‌టీపీ విలీనంపై  షర్మిల రాష్ట్ర కార్యవర్గంలో వివరించారు.అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ  చేయాలనుకున్నవారు బీ ఫారాల కోసం ధరఖాస్తు చేసుకోవాలని వైఎస్ షర్మిల సూచించారు.

కాంగ్రెస్ లో విలీన ప్రక్రియకు బ్రేక్ పడిన తర్వాత వైఎస్ఆర్‌టీపీ కార్యవర్గ సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశంలో  ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో  కాంగ్రెస్ లో వైఎస్ఆర్‌టీపీ విలీన ప్రక్రియ కోసం చేసిన చర్చల గురించి వివరించారని సమాచారం. ఈ ప్రక్రియకు బ్రేక్ పడడంతో  ఒంటరిగా పోటీ చేయాలని  షర్మిల నిర్ణయం తీసుకున్నారు. పాలేరుతో పాటు మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుండి షర్మిల పోటీ చేసే అవకాశం ఉంది.

2021 జూలై 8వ తేదీన వైఎస్ఆర్‌టీపీ వైఎస్ షర్మిల ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాదయాత్ర చేశారు. అయితే  గత కొంతకాలంగా  కాంగ్రెస్ లో వైఎస్ఆర్‌టీపీని విలీనం చేయాలని షర్మిల భావించారు.  ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా,రాహుల్ గాంధీలతో  షర్మిల చర్చించారు. వైఎస్ షర్మిల తెలంగాణలో  ప్రచారం చేస్తే  రాజకీయంగా నష్టమని తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు కొందరు  బలంగా వాదించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  షర్మిలను ఏపీలో  కాంగ్రెస్ బలోపేతం కోసం ఉపయోగించుకోవాలని వాదించారు. తెలంగాణకు చెందిన మరికొందరు నేతలు  మాత్రం  షర్మిల తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కోసం ఉపయోగించుకోవచ్చనే అభిప్రాయాలను కూడ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios