Asianet News TeluguAsianet News Telugu

రైతుల సమస్యలపై కేసీఆర్‌కు చిత్తశుద్ది లేదు: వైఎస్ షర్మిల

రైతుల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ది లేదని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల విమర్శించారు. గురువారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు.

YSRTP chief YS Sharmila Comments on KCR
Author
Hyderabad, First Published Jan 27, 2022, 12:34 PM IST

హైదరాబాద్: రైతుల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ సీఎం KCR కు చిత్తశుద్ది లేదని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.గురువారం నాడు హైద్రాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో YSRTP చీఫ్ YS Sharmila మీడియాతో మాట్లాడారు. 

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. Farmars కష్టాలు కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. కొందరు రైతులకు పంట భీమా కూడ అందని పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర సీఎంగా YSR ఉన్న సమయంలో రైతుల పరిస్థితి ఇలానే ఉందా అని ఆమె ప్రశ్నించారు. రైతుల పెట్టుబడి తగ్గించి రాబడి ఎక్కువ వచ్చేలా చర్యలు తీసుకొన్న విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. రైతులను అప్పట్లో వైఎస్ఆర్ సర్కార్ రైతులను అన్ని రకాలుగా ఆదుకోలేదా అని ఆమె ప్రశ్నించారు.

ఇన్‌పుట్ సబ్సిడీ, పంట భీమా పథకాలను కొనసాగించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. బోర్లు వేసకోవడానికి ఆర్ధిక సహాయంతో పాటు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకొందన్నారు. సీఎంగా వైఎస్ఆర్ రైతుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టారని ఆమె గుర్తు చేశారు. అయితే సీఎం గా ఉన్న కేసీఆర్ ఎందుకు రైతుల సంక్షేమం కోసం చర్యలు తీసకోవడం లేదో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.

తెలంగాణలో మిర్చి, పత్తి రైతులు  ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు.  వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించుకోవాలని కేసీఆర్ కోరారని ఆమె గుర్తు చేశారు. ప్రత్యామ్నాయం పంటలు వేసుకొన్న రైతులకు గిట్టుబాటు ధర లభించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి, పత్తి పంటలకు  గిట్టుబాటు దర రాని పరిస్థితుల్లోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆమె చెప్పారు. నకిలీ ఎరువులు, విత్తనాలతో కూడా రైతులు నష్టపోతున్నారన్నారు.

రుణమాపీ చేస్తామని హమీ ఇచ్చిన కేసీఆర్ సర్కార్  కేవలం రూ., 35 వేల రుణం తీసుకొన్న  మూడు లక్షల మందికి మాత్రమే పంట రుణాలను మాఫీ చేశారని షర్మిల గుర్తు చేశారు.36 లక్షల మంది రైతులను కేసీఆర్ సర్కార్ మోసం చేసిందని ఆమె విమర్శించారు. రైతులు తీసుకొన్న రుణాలు బ్యాంకుల్లో అలానే ఉన్నాయన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వని కారణంగా రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకొంటున్నారని ఆమె చెప్పారు.

వయస్సుతో సంబంధం లేకుండా రైతు భీమాను అమలు చేయాలని ఆమె కోరారు. కౌలు రైతుల సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు.రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు ఆమె బహిరంగ లేఖ రాశారు.

రైతుల సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ చొరవ చూపడం లేదన్నారు. రైతునని చెప్పుకొనే కేసీఆర్ కు రైతుల సమస్యలు పట్టవా అని ఆమె ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కూడా కేసీఆర్ కు మానవత్వం లేదా అని ఆమె ప్రశ్నించారు.రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని ఆమె కేసీఆర్ ను కోరారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios