హైదరాబాద్: మీ అక్కగా సమాజాన్ని బాగు చేసేందుకు ముందుకు వస్తున్నానని వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులతో చెప్పారు. తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్న ఆమె బుధవారం విశ్వవిద్యాలయాల విద్యార్థులతో సమావేశమయ్యారు. 

ఎంతో మంది అనేక ఉద్యోగాలు చేస్తున్నారని ఆమె అన్ారు. ప్రతి జిల్లాకు యూనివర్శింటీని తెచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని ఆమె అన్నారు. పేదరికం వల్ల ఏ విద్యార్థి కూడా చదువు ఆపేయకూడదనే ఉద్దేశంతో వైఎస్ ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా భరోసా కల్పించారని చెప్పారు.

ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం ద్వారా వేయి కడితే మిగతా ఫీజులు ప్రభుత్వం భరిచేదని ఆమె చెప్పారు. నేడు ఎంతో మంది పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని ఆమె చెప్పారు వాళ్లంతా వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు పెట్టుకున్నారని చెప్పారు. 

ఈ రోజు అందరికీ ఒక మంచి సమాజాం కావాలని, తెలంగాణలో ఎంతో మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, అందరి నిరీక్షణ కూడా ఫలించాలనంటే ఒక మంచి సమాజం రావాలని ఆమె అన్నారు. తెలుగు ప్రజలను వైఎస్ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని షర్మిల అన్నారు.