కవిత దీక్ష చాలా హాస్యాస్పదం.. పోరాటం ఢిల్లీలో కాదు, కేసీఆర్ ఇంటిముందు చేయాలి.. కవితపై షర్మిల ఫైర్

ఎమ్మెల్సీ కవిత మీద షర్మిల ఫైర్ అయ్యారు. ఆమె దీక్ష హస్యాస్పదం అంటూ వ్యాఖ్యానించారు. స్కాంలో ఇరుక్కుని ఇక అరెస్టవ్వడమే తరువాత కాబట్టే దీక్ష అంటూ మొదలెట్టిందని విమర్శించారు. 

YS Sharmila fires on Kavita over protest on women reservation bill in delhi - bsb

హైదరాబాద్ : ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం చేపట్టిన దీక్ష మీద వైఎస్సార్ తెలగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అదంతా హస్యాస్పదంగా ఉందంటూ కొట్టిపారేశారు. కేసీఆర్ కు, బీఆర్ఎస్, కవితకు మహిళల మీద గౌరవం లేదు. నిజంగానే గౌరవం ఉంటే 33 శాతం రిజర్వేషన్లు బీఆర్ఎస్ అమలు చేసిందా? ముందు చూసుకోవాలి.. అన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత వారి పార్టీలో మహిళా ప్రాతినిథ్యమే లేదు. 2018లో నలుగురికి ఇచ్చారు. మొదటి క్యాబినెట్ లో మహిళలు లేరు, రెండో క్యాబినెట్ లో ఇద్దరున్నారు. 

అసలు పోరాటం చేయాల్సింది కేసీఆర్ ఇంటిముందు, ప్రగతిభవన్ ముందు కదా.. ఢిల్లీలో కాదు. తండ్రితో గొడవ చేయలేక.. లిక్కర్ స్కాంలో ఇరుక్కుంది కాబట్టే మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు వేసుకుంది. కనీసం రెండుమూడేళ్లుగా ఈ స్కాంలో ఆమె ఉంది. ఆ కేసులో ఇరుక్కుపోయింది. ఇక అరెస్టే తరువాయి అని అర్థమయ్యింది కాబట్టి ఇప్పుడు ఈ బిల్లు అంటూ ముందుకేసుకుంది. 

కవిత మీద నోటీసులు ఇస్తే.. తెలంగాణ ఆడపడుచుకు అవమానం అంటారు. తెలంగాణ ఆత్మగౌరవం అని.. ఫైటర్ అని ఇంకోటని, ఇంకోటని.. తెగ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం అంటే కవితనేనా.. నిజంగానే మహిళల మీద ప్రేముంటే..గవర్నర్ ను అంత మాటన్న వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తే మాట్లాడలేదు. ఒక్కమాట అలా అనొద్దని ఖండించలేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డితో కవిత మాట్లాడదు. కేంద్రంలో సోనియాను పొగుడుతది.. ఇదేదో విచిత్రంగా ఉంది’ అంటూ విరుచుకుపడ్డారు. 

బీజేపీ కనక మహిళా బిల్లుపై ముందుకొస్తే.. మద్దతివ్వడానికి అన్ని పార్టీలు సిద్ధం.. ఎమ్మెల్సీ కవిత

ఇదిలా ఉంటే, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీ జంతర్ మంతర్ లో నేడు దీక్ష చేపట్టిన భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  రాజకీయాల్లో కూడా మహిళలకు సమచిత స్థానం దక్కాలని అన్నారు.  చాలాకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి చట్టంగా తీసుకురావాలని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు నిరసన దీక్షలో ఆమె మాట్లాడారు. ఆకాశంలో సగం కాదని..  ధరణిలో సగం అవకాశాల్లోనూ సగం కావాలంటూ ఆమె వ్యాఖ్యానించారు. 

‘భారతీయ సంస్కృతిలోనే మహిళలకు పెద్దపీటవేశారు. అందుకే ఎక్కడైనా మహిళలనే ముందుగా ప్రస్తావిస్తాం. రాజకీయాల్లోనూ మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు ఇవ్వాలని అంశం చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. దేవి గౌడ ప్రధానమంత్రిగా ఉన్న 1996లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఇన్నేళ్లు గడుస్తున్న అది ఇంకా చట్టంగా మారలేదు. కేంద్రంలో పరిపాలనలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజారిటీ ఉంది. ఈ బిల్లు విషయంలో వారు కనుక చిత్తశుద్ధితో  ఉంటే..  మహిళా రిజర్వేషన్లు బిల్లును చట్టంగా  చేయాలని అనుకుంటే..  బిజెపి ముందుకు వస్తే..  అన్ని పార్టీలు దీనికి మద్దతు పలుకుతాయి.  మహిళా రిజర్వేషన్లను సాధించేవరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదు’  అని కవిత అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios