YS Sharmila: 108కి ఫోన్ చేసిన వైఎస్ షర్మిల.. అంబులెన్స్ రాకపోవడంతో పాదయాత్రకు సంబంధించిన అంబులెన్స్‌లోనే..

గురువారం ఉదయం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) బస చేసిన చోటుకు 100 మీటర్ల దూరంలో యాక్సిడెంట్ జరిగింది. దీంతో వెంటనే స్పందించిన వైఎస్ షర్మిల స్వయంగా 108కి ఫోన్ చేశారు.

YS Sharmila Calls 108 but no response

వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSR telangana party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజ సమస్యలు వింటూ ఆమె తన పాదయాత్రను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం పాదయాత్ర దేవరకొండ నియోజవర్గానికి చేరింది. బుధవారం రాత్రి వైఎస్ షర్మిల చింతపల్లి మండలం కిష్టరాయినిపల్లి క్రాస్ మర్రిగూడ గ్రామం వద్ద నైట్ హాల్ట్ చేశారు. గురువారం ఉదయం వైఎస్ షర్మిల బస చేసిన చోటుకు 100 మీటర్ల దూరంలో యాక్సిడెంట్ జరిగింది. 

YS Sharmila Calls 108 but no response

దీంతో వెంటనే స్పందించిన వైఎస్ షర్మిల స్వయంగా 108కి ఫోన్ చేశారు. అయితే అరగంటల దాటిన అంబులెన్స్ రాకపోవడంతో షర్మిల క్షతగాత్రులను ఆస్పత్రికి పంపేందుకు తన కాన్వాయ్‌లోని అంబులెన్స్‌ను అక్కడికి పంపించారు. దీంతో క్షతగాత్రులను ఆమె పాదయాత్రకు సంబంధించిన అంబులెన్స్‌లో వైఎస్సార్‌టీపీ నాయకులు ఆస్పత్రికి తరలించారు. 

Also raed: వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్న యాంకర్ శ్యామల.. సంతోషంగా ఉందంటూ కామెంట్స్..

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ దివంగత మహానేత పేదల కోసం ప్రవేశపెట్టిన 108 సర్వీసులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. 108కు ఫోన్ చేసినా స్పందన కరువైందన్నారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలే జరిగాయని, 108 సేవలను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు.

Also read: షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష.. వినతిపత్రం ఇచ్చిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ పాలన కోసం పాదయాత్ర చేయనున్నట్టు షర్మిల ప్రకటించారు. గత నెల 20 న చేవెళ్ల నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభించారు. మొత్తం తెలంగాణలోని  90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర బుధవారంతో 15 రోజులు పూర్తి చేసుకుంది. బుధవారం రోజున కుర్మెడు నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. కిష్టరాయినిపల్లి గ్రామం నుంచి మర్రిగూడ మండల కేంద్రం సమీపానికి చేరుకుంది. అక్కడికి సమీపంలోనే బుధవారం రాత్రి షర్మిల బస చేశారు. అయితే గురువారం దీపావళి పండగ కావడంతో షర్మిల పాదయాత్ర నిర్వహించడం లేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios