హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ లు హాజరయ్యారు. 

అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న సీఎం వైయస్ జగన్ అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా రాజ్ భవన్ చేరుకున్నారు. వైయస్ జగన్ కు గవర్నర్ నరసింహన్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. 

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం రాజభవన్ కు చేరుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు గవర్నర్ నరసింహన్ స్వాగతం పలికారు. పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ లతో విడివిడిగా భేటీ అయ్యారు. 

అనంతరం ముగ్గురు కలిసి రాష్ట్రాల మధ్య సంబంధాలు పాలనాపరమైన అంశాలపై చర్చించారు. అలాగే విభజన పరమైన అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ నరసింహన్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.