హైదరాబాద్: ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైకోర్టు తలుపు తట్టారు. హైకోర్టులు ఆ మేరకు సోమవారంనాడు పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడానికి ఎసీబీ ప్రత్యేక కోర్టు నిరాకరించడంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున వ్యక్తిగతంగా హాజరు కావడం కుదరదని అంటూ అందువల్ల తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన హైకోర్టును కోరారు.

Also Read: హాజరు కావాల్సిందే: జగన్ కు మరోసారి కోర్టు షాక్

ఆస్తుల కేసులో వైఎస్ జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనని హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రతి శుక్రవారం విచారణకు మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఐయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

ఇటీవల వైఎస్ జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావడం లేదు. ఎప్పటికప్పుడు వ్యక్తిగత మినహాయింపు కోరుతూ ఆయన దాటేస్తూ వస్తున్నారు. దీంతో కోర్టు అసహనం కూడా వ్యక్తం చేసింది. ఈ నెల 24వ తేదీన కూడా అటువంటి మినహాయింపే జగన్ తీసుకున్నారు. 

Also Read: ఆస్తుల కేసులో కోర్టుకు సీఎం జగన్ గైర్హాజర్: అబ్సెంట్ పిటిషన్ దాఖలు